GVL Narasimha Rao : రాష్ట్రంలో ప్రమాదకర స్థితిలో శాంతిభద్రతలు : ఎంపీ జీవీఎల్

బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు.

GVL Narasimha Rao (1)

AP Law And Order : రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అమిత్ షా దగ్గర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై పూర్తి రిపోర్ట్ ఉందన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో నిజాలు బయటకు రావాలని తెలిపారు. విశాఖలో భూ మాఫియా జరుగుతుందని ఆరోపించారు.

ఈ మేరకు ఆదివారం విజయవాడలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. విశాఖ భూ దందాపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా సీఎం భూ సెటిల్ మెంట్ లు చేస్తున్నారని వెల్లడించారు. తనకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇవ్వాలని పేర్ని నానిని అడుగుతున్నానని తెలిపారు.

Dwarampudi Chandrasekhar Reddy : నా మీద లేని పోనీ ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోను.. ఎమ్మెల్యే ద్వారంపూడి వార్నింగ్

బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు. వైసీపీ అంటే రాక్షస సంత అని ప్రకటించుకోవాలని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి ఆ పిల్లవాడి కుటుంభానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగనవని చెప్పి..సీఎం రాజీనామా చేయాలన్నారు. ఏపీలో ఇసుక, మైనింగ్ పై సీబీఐ ఎంక్వరి జరగాలని కోరారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు జరుగుతుందని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు