చెబితే వినాలి మరి : కరోనాతో కృష్ణా వణుకుతోంది

  • Publish Date - April 29, 2020 / 11:18 AM IST

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది విజయవాడ వాసుల పరిస్ధితి. కరోనా వ్యాప్తి చెందుతుంది, లాక్‌డౌన్‌ను పాటించండి, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావొద్దని అధికారులు మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా  కృష్ణా జిల్లా వాసులను వణికించే రేంజ్ కు కరోనా తీవ్రత పెరిగింది. జిల్లాలో ఏకంగా అత్యధికంగా కేసులు నమోదవుతుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.

2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం ఒక్కరోజే కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదవడం తీవ్ర కలకలం రేపింది.  బెజవాడ వాసుల్లో మరింత ఆందోళన మొదలైంది. మొదటి నుంచి విదేశీయులు, ఢిల్లీ మర్కజ్ కేసులతో ఉక్కిరిబిక్కిరైన విజయవాడ ప్రజలు… కొత్తగా నమోదవుతున్న కేసులతో ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. 

కొత్తగా గుర్తించిన బాధితుల్లో కృష్ణా జిల్లాలో 52 మంది, పశ్చిమ గోదావరిలో 12 మంది, మరో ఆరు జిల్లాలో 17 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు నిర్ధారించారు. మొత్తంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1, 097కి చేరింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 60 మందికి నెగటివ్ రావడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 835 మందికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య 31గానే ఉంది. 

జిల్లాల వారీగా కేసులు : కర్నూలు 279. గుంటూరు 214. కృష్ణా 177. చిత్తూరు 73. నెల్లూరు 72. కడప 58. ప్రకాశం 56. అనంతపురం 53. పశ్చిమగోదావరి 51. తూర్పుగోదావరి 39. విశాఖపట్టణం 22. శ్రీకాకుళం 3