AP Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇదిలా ఉంటే.. వాతావరణ శాఖ మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చెట్ల కింద ఉండొద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.
మంగళవారం (22-07-2025) :
* అల్లురి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం.
బుధవారం (23-07-2025) :
* అల్లురి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే ఛాన్స్.
Also Read: మహిళలకు ఫ్రీ బస్సు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఆ టికెట్ లో పూర్తి వివరాలు..
గురువారం (24-07-2025) :
* అల్లురి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే ఛాన్స్.
శుక్రవారం (25-07-2025) :
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం.