Heavy Rains : ఏపీని వెంటాడుతున్న వానగండం..రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత

ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశముందని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు.

Heavy rains in AP : ఏపీని వానగండం వెంటాడుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ముంచెత్తుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ.. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్ చేసింది. నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నెల్లూరు, కడప జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

భారీ వర్షాలతో నెల్లూరు, కడప అతలాకుతలమవుతున్నాయి. నెల్లూరులో పెన్నా, పంబలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో మైలవరం, గండికోట, బుగ్గవంక ప్రాజెక్టులు ఎప్పుడూ లేనంతగా జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో చెరువులు, కుంటలు ప్రమాదపుటంచున ఉన్నాయి.

Heavy Rains : నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు..పలు చోట్ల రాకపోకలు బంద్

నెల్లూరుపై వరుణుడు పగబట్టాడు. మొన్నటి వరదలకే అల్లాడిపోయిన నెల్లూరు ప్రజలను.. వానదేవుడు మరోసారి వణికిస్తున్నాడు. నెల్లూరు వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలో సరాసరి 10 పాయింట్‌ 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పొదలకూరు మండలంలో 20 పాయింట్‌ 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల రాకపోకలు బంద్‌ అయ్యాయి.

వరద నీరు ముంచెత్తడంతో.. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. చెరువులు నిండు కుండల్లా మారాయి. గూడూరులో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గూడూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో.. విజయవాడ – చెన్నై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇరవై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అటు.. గూడూరు వెంకటగిరికి మధ్య కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Rains warning: ఏపీకి హెచ్చరిక.. అతి భారీ వర్షాలు పడే అవకాశం!

భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు.. కడప జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్థంభించింది. ఇంకా పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కడప జిల్లాకు మరో వాయుగుండం పొంచి ఉంది. ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయి.

జిల్లాలో ఉన్న మొత్తం 1 వేయి 450 చెరువుల్లో 40 చెరువులు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. 40 చెరువుల కింద అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తక్షణమే ఈ చెరువుల కింద ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే అలుగు కట్టలను తెంపారు.

Andhra Pradesh Rain : వామ్మో మళ్లీ వానగండం, ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు

భారీ వర్షాలతో పెన్నానదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు వద్ద పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని తీరం కోతకు గురవుతోంది. భగత్‌సింగ్ కాలానీలో.. ప్రమాదం పొంచి ఉంది. నది సమీపంలోని ఇళ్లు కోతకు గురవుతుండడంతో.. కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

భారీ ప్రవాహానికి కండలేరు జలాశయం ప్రమాదం అంచుల్లో ఉంది. జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. ఏ క్షణంలో కట్ట తెగిపోతుందనే భయం.. స్థానికులను వెంటాడుతోంది. కండలేరు డ్యాం మట్టి ఆనకట్ట కోతకు గురవుతుండటంతో.. సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు