Heavy Rains : నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు..పలు చోట్ల రాకపోకలు బంద్

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సరాసరి వర్షపాతం 10.7 సెo.మీగా నమోదైంది. అత్యధికంగా పొదలకూరు మండలంలో 20.2 సెo.మీ వర్షపాతం నమోదు అయింది.

Heavy Rains : నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు..పలు చోట్ల రాకపోకలు బంద్

Nellore (1)

Updated On : November 30, 2021 / 11:00 AM IST

Heavy rains in Nellore : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సరాసరి వర్షపాతం 10.7 సెo.మీగా నమోదైంది. అత్యధికంగా పొదలకూరు మండలంలో 20.2 సెo.మీ వర్షపాతం నమోదు అయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

చెరువులు నిండు కుండల మారుతున్నాయి. గూడూరులో పంబలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గూడూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 20 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి.

VC Sajjanar : ఆర్టీసీ బస్సులో కుటుంబంతో కలిసి ప్రయాణించిన సజ్జనార్‌

చెన్నై, తిరుపతి నుండి నెల్లూరు వైపు వచ్చే వాహనాలను నాయుడుపేట నుండి వెంకటగిరి, రాపూరు, పొదలకూరు, అయ్యప్ప సెంటర్ మీదుగా హైవేకు కలుపుతూ డైవర్షన్ చేశారు. నెల్లూరు నుండి తమిళనాడు వైపు, తిరుపతి వెళ్ళే వాహనదారులను కృష్ణపట్నంపోర్టు రోడ్డు వైపుకు వరగలి, కడివేడు, కోట క్రాస్ రోడ్డు మీదుగా హైవేకు ట్రాఫిక్ డైవర్షన్ చేశారు.

గూడూరులో ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. కండలేరు జలాశయం నుంచి నీటి విడుదలకు తోడు భారీ వరదలతో జలమయంగా గూడూరు జలమయంగా మారింది. గూడూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

TSRTC : శబరిమల యాత్రకు టీఎస్ఆర్టీసీ బస్సులో ఆ ఐదుగురికి ఉచిత ప్రయాణం

వాహనదారులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బ్రిడ్జి దగ్గర వన్‌వేలో ట్రాఫిక్‌ను పంపిస్తున్నారు. జాతీయ రహదారిపై పరిస్థితి నెల్లూరు ఎస్పీ విజయరావు పరిశీలించారు. వాహనదారుల్లో వృద్ధులు, పిల్లలు ఉంటే వారికి కావాల్సిన సాయం చేయాలని ఆదేశించారు.