Andhra Pradesh Rain : వామ్మో మళ్లీ వానగండం, ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు

అల్పపీడనం ప్రభావంతో.. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలున్నాయి.

Andhra Pradesh Rain : వామ్మో మళ్లీ వానగండం, ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు

Ap Rain

Heavy rain expected : వారం కింద కురిసిన వర్షాల నుంచే రాయలసీమ, దక్షిణ కోస్తా ఇంకా కోలుకోవడం లేదు. ఇంతలోనే.. మరో వానగండం వచ్చిపడింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాన ముప్పు పొంచి ఉండటంతో.. రాయలసీమ, కోస్తా ప్రజలంతా.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలను.. వర్షం వదలట్లేదు. నెల గ్యాప్‌లో.. రెండు సార్లు అతి భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలమైపోయాయి. మొన్న జరిగిన విధ్వంసం నుంచే.. ఇంకా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు కోలుకోవడం లేదు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.

Read More : Paddy Issue : మంత్రివర్గ సమావేశం..ధాన్యం కొనుగోలే కీలక అంశం

అల్పపీడనం ప్రభావంతో.. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలున్నాయి. 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తా తీర ప్రాంతంలో.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉంది. దీంతో డిసెంబర్‌ 1 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. కోస్తా జిల్లాలకు తుపాను గండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో 2, 3 రోజుల్లో.. తుపానుపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అల్పపీడనం మరింత బలపడితే.. డిసెంబర్ 4, 5వ తేదీకల్లా.. తుపాను మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Read More : AP Governor Biswabhusan : కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత

సోమవారం తిరుపతిలో భారీ  వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో తిరుపతిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. భా రీవర్షం కురిస్తే ఘాట్‌రోడ్‌లో వాహనాలను నిలిపివేసే అవకాశాలున్నాయి. కడప సమీపంలోని ఊటుకూరు చెరువుకు గండి పడింది. దీంతో.. అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టారు. చెరువు కట్ట తెగితే.. కడపలోని 44, 45, 46 డివిజన్లు మునిగే ప్రమాదం ఉంది. భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇటు గత 15రోజులుగా తమిళనాడు నగరం భారీవర్షాలతో అల్లకల్లోలమైపోయింది. ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. చెన్నైలోని చాలా కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం నుంచి కోలుకోలేదు. ఈ సమయంలో మరోసారి వానగండం పొంచి ఉండటంతో తమిళనాడు వాసులు టెన్షన్ పడుతున్నారు.