Paddy Issue : మంత్రివర్గ సమావేశం..ధాన్యం కొనుగోలే కీలక అంశం

కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలను, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలను తిప్పి కొట్టేలా సీఎం మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది.

Paddy Issue : మంత్రివర్గ సమావేశం..ధాన్యం కొనుగోలే కీలక అంశం

Paddy Issue

Telangana State Cabinet Meeting : పార్లమెంటరి పార్టీ మీటింగ్‌లో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం… మంత్రులకు కూడా కేబినెట్‌లో పలు సూచనలు చేయనున్నారు. యాసంగి పంటల మార్పిడి ప్రణాళికలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. దాంతో పాటు భవిష్యత్తులో కేంద్రం వైఖరిపై ఏలా ముందుకు వెళ్లాలని దానిపై చర్చ జరగనుంది. 2021, నవంబర్ 29వ తేదీ సోమవారం తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్​లో ఈ భేటీ జరగనుంది.

Read More : Parliament : నేటి నుంచే పార్లమెంట్ సమావేశాలు…కీలక బిల్లులు ఇవే

వివిధ దేశాల్లో కరోనా ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండటంతో పాటు అన్ని రకాల చర్యలు చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించనున్నారు సీఎం కేసీఆర్. దాంతో పాటు కొత్త వేవ్ కట్టడి చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ధరణి, పోడు భూముల సబ్ కమిటీల నివేదికలపై మంత్రి మండలిలో నిర్ణయాలు తీసుకోనున్నారు కేసీఆర్. రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయంలో కేబినెట్ లో చర్చకు రానుంది.

Read More : Man Assault Woman : దారుణం.. పెళ్లి చేసుకుంటానని.. యువతిపై లైంగిక దాడి

తాజా రాజకీయ పరిణామాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలను, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలను తిప్పి కొట్టేలా సీఎం మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది. జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలాగా మంత్రులు కిందిస్థాయి నేతలతో సమన్వయం చేసుకొని ప్రచారం చేసేలా చూడాలని కేసీఆర్ ఆదేశించే అవకాశం ఉంది. దీంతో పాటు రైతు చట్టాల ఉపసంహరణతో  కేంద్రం కొద్దిగా వెనకడుగు వేసిందని, అదే విధంగా కొత్త విద్యుత్ చట్టాల విషయంలో వెనక్కి తగ్గేలాగా పోరాటం చేసే అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.