Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మలక్కా జలసంధి, దానికి ఆనుకుని ఉన్న మలేషియా పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని చెప్పారు. అది ఇవాళ దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి, వాయుగుండంగా మారుతుందని అన్నారు.
అనంతరం రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించి అది తుపానుగా మారుతుందని చెప్పారు. మరోవైపు, నైరుతి బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడుతుందని అన్నారు. 2 అల్పపీడనాల కారణంగా కొన్ని రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. (Weather Updates)
వాయుగుండం తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
రాహుకేతుగ్రహ సమస్యలు: అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న వేళ ఒక్కసారిగా భయంకర ప్రాబ్లమ్స్