కర్నూలులో హైకోర్టు బెంచ్, అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజీ- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.

High Court Bench In Kurnool (Photo Credit : Google)

Cm Chandrababu : న్యాయశాఖ సమీక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే జూనియర్ లాయర్లకు రూ.10వేలు గౌరవ వేతనం అందజేస్తామన్నారు చంద్రబాబు. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.

Also Read : మీరు మారరా? మాజీ సీఎం జగన్‌కు కేతిరెడ్డి ఇచ్చిన సలహాపై వైసీపీలో ఫైర్‌..!

హైకోర్టు బెంచ్ ను రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మొదటి నుంచి ఉంది. జగన్ సీఎం అయ్యాక హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతాన్ని న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై అనేక కోర్టు కేసులు నడిచాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు సర్కార్ వచ్చింది. ఈ క్రమంలో మరోసారి రాయలసీమ జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తాజాగా దీనికి సంబంధించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పంపాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు ఇవాళ న్యాయశాఖపై జరిపిన రివ్యూలో చంద్రబాబు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలంటే.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన కేంద్రానికి పంపాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు చంద్రబాబు.