Postal Ballot Controversy : పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపు(జూన్ 1) సాయంత్రం 6 గంటలకు తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ సీఈవో ఇచ్చిన మెమోపై అభ్యంతరం తెలుపుతూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి వాయిదా వేసింది కోర్టు. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబుతామని కోర్టు తెలిపింది.
పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీల్ లేకున్నా చెల్లుతుందని ఈసీ చెప్పగా.. దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును వాయిదా వేసింది.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి. చాలా నియోజకవర్గాల్లో టెన్షన్ ఉంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఒక చాలెంజ్ గా మారింది. పోస్టల్ బ్యాలెట్ పైనే పలువురు అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని వైసీపీ భావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఈసీ ఇచ్చిన నిబంధనల సడలింపు తమకు ఇబ్బందికరంగా మారిందన్నది వైసీపీ భావన. దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో నిబంధనల సడలింపు ఈసీ రూల్స్ కు విరుద్ధమని వైసీపీ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఎన్నికల కమిషన్ కింద పని చేసే సీఈవో మెమో ఇవ్వడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, సీఈవో తన మెమోను నిన్న విత్ డ్రా తీసుకున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. పోస్టల్ బ్యాలెట్ పై ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం అని, ఎలక్షన్ రూల్స్ కు విరుద్ధం అని, సడలింపులు సరికాదని వాదించారు.
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గెలుపోటముల విషయంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు.
ఎక్కువమంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలి, ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు, చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటిని సర్దుకుని పోవాలని ఈసీ భావించింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. మొదటి నుంచి ఉద్యోగులు కొంత ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఉన్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వైసీపీ కూడా ఇదే భావనలో ఉంది. 4లక్షల 50వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం రికార్డ్. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువ పర్సెంట్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడితే ఇబ్బందిగా ఉంటుందని వైసీపీ భావిస్తోంది. అందుకే, నిబంధనల సడలింపుపై వైసీపీ కోర్టును ఆశ్రయించిందని పరిశీలకులు చెబుతున్నారు.
Also Read : ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు? టేబుల్స్ ఎందుకు? రౌండ్స్ అంటే? కౌంటింగ్ ప్రక్రియపై 10టీవీ ఎక్స్‌క్లూజివ్