ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు? టేబుల్స్ ఎందుకు? రౌండ్స్ అంటే? కౌంటింగ్ ప్రక్రియపై 10టీవీ ఎక్స్‌క్లూజివ్
ఏయే నియోజకవర్గాల్లో తొలి ఫలితం రానుంది? ఏయే నియోజకవర్గాల్లో లేటుగా రిజల్ట్ రానుంది? ఈ అంశాలకు సంబంధించి 10టీవీ ఇన్ డీటైల్డ్ అనాలసిస్...

Ap Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రేపు ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. 4న కౌంటింగ్ జరగబోతోంది. అసలు.. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగబోతోంది? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ స్థానాలకు సంబంధించి అసలు కౌంటింగ్ ఎలా చేస్తారు? ఏ దశ ఏ విధంగా ఉంటుంది? దీనిపై అటు రాజకీయ నాయకులకు ఇటు ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి.
కౌంటింగ్ ప్రక్రియను ఏ విధంగా మొదలు పెడతారు? ఏ విధంగా కట్టలు కడతారు? టేబుల్స్ ఏర్పాటు ఎందుకు? రౌండ్స్ అంటే ఏంటి? ఏయే నియోజకవర్గాల్లో తొలి ఫలితం రానుంది? ఏయే నియోజకవర్గాల్లో లేటుగా రిజల్ట్ రానుంది? ఈ అంశాలకు సంబంధించి 10టీవీ ఇన్ డీటైల్డ్ అనాలసిస్…
4 దశల్లో.. కౌంటింగ్ ప్రక్రియ ఇలా..
* జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు
* నాలుగు దశల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ
* తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు
* 25 పోస్టల్ బ్యాలెట్లు ఒక కట్ట కడతారు
* పోస్టల్ బ్యాలెట్ కట్టలను 14 టేబుల్స్ లో సర్దుతారు
* పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు గంట లేదా గంట 15 నిమిషాలు పట్టే అవకాశం ఉందని అంచనా
* పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాక లీడ్స్ ప్రకటన
* ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థికి సంబంధించిన ఒక ఏజెంట్ ఉంటారు
* కౌంటింగ్ మొదలైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు
* ఉదయం 10 నుంచి 11 గంటలకు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం
* వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలపై ప్రకటన
* ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం
* ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోవాలి
* ఉదయం 5 గంటలకు సిబ్బందికి టేబుళ్ల కేటాయింపు
* కౌంటింగ్ గోప్యతపై సిబ్బందితో తొలుత ప్రమాణం (కౌంటింగ్ కు సంబంధించి ఏ వివరాలు బయటకు పొక్కకుండా ఉండటానికి, మేము ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడం అని ప్రమాణం చేయిస్తారు. ఓత్ తర్వాతే లోనికి అనుమతి.)
* తొలుత సర్వీస్ ఓట్లు, తర్వాత పోస్టల్ ఓట్లు లెక్కింపు
* ప్రతి 25 పోస్టల్ బ్యాలెట్లను ఒక కట్టగా కట్టి లెక్కింపు
* ఒక్కో కౌంటింగ్ టేబుల్ కు ఒక రౌండ్ కు 20 కట్టలు
* ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటు
* పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ఆధారంగా ఈవీఎం ఓట్ల లెక్కింపు
* సీరియల్ నెంబర్ 1-14 వరకు ఈవీఎంల లెక్కింపుతో ఫస్ట్ రౌండ్ పూర్తి
* ఈవీఎంలలో నమోదైన ఓట్లు సరిచూసుకున్న తర్వాత వీవీప్యాట్ చీటీల లెక్కింపు
* లాటరీ విధానంలో ఐదు పోలింగ్ కేంద్రాల ఈవీఎం వీవీ ప్యాట్ల ఎంపిక
* 2019 ఎన్నికల్లో 2లక్షల 50వేల లోపు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదవగా.. 2024 ఎన్నికల్లో 4 లక్షల 50వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు కొంత సమయం పట్టే అవకాశం.
* సర్వీస్ ఓట్లు.. ఏపీలో ఓటు ఉండి.. సైనికుడిగా లేదా మరో ఉద్యోగం చేస్తూ వేరే రాష్ట్రాల్లో పని చేస్తున్న వారు సర్వీస్ కేటగిరీ కిందకు వస్తారు. సర్వీస్ కేటగిరి ఉద్యోగులు దాదాపు కౌంటింగ్ కు రెండు రోజుల ముందు వరకు వాళ్ల పోస్టల్ బ్యాలెట్ పంపించే అవకాశం ఉంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య 5లక్షల వరకు చేరే అవకాశం ఉందని ఎన్నికల అధికారుల అంచనా.
Also Read : ఆరు నూరైనా ఫలితమిదే..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..