ఏపీ క్యాబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ..! మంత్రి పదవులు దక్కేదెవరికి? పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా?

Ap New Cabinet : ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఇప్పుడు క్యాబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములు అవుతాయా? చేరేటట్లు అయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు? దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

క్లీన్ ఇమేజ్ ఉన్నవారిపై చంద్రబాబు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈసారి సీనియర్లకన్నా యువత, బలహీనవర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా? అన్నదానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేలా అయితే ఆయన స్థాయికి తగ్గట్టు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ నుంచి ఆశావహులు ఉన్నారు.

Also Read : పంటికి పన్ను కంటికి కన్ను: టీడీపీ దాడులపై గోరంట్ల మాధవ్ స్పందన