Tdp Vs Bjp
Tdp Vs Bjp : సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య చెలరేగిన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకంపై వివాదం చెలరేగింది. గతంలో మల్లికార్జున టీడీపీ కార్యకర్తలను వేధించారని, వైసీపీకి అనుకూలంగా పని చేశారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. అలాంటి ఆరోపణలున్న వ్యక్తిని మళ్లీ కమిషనర్ గా ఎలా నియమిస్తారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. మంత్రి తీరుపై వారు భగ్గుమన్నారు. కమిషనర్ నియామకంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. సమర్ధవంతమైన అధికారి కాబట్టే నియమించామన్నారు సత్యకుమార్. కాగా, మల్లికార్జునకు అనుకూలంగా మంత్రి మాట్లాడటంతో టీడీపీ శ్రేణులు బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేశాయి. మల్లికార్జున విధులకు హాజరైతే బయటకు ఈడేస్తామని గతంలో పరిటాల శ్రీరామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకంపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య కొంతకాలంగా వివాదం చెలరేగుతోంది. ఇవాళ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరంలో పర్యటిస్తున్న క్రమంలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కమిషనర్ గా మల్లికార్జునను ఎలా నియమిస్తారని నిలదీశారు. కచ్చితంగా ఆయనను ధర్మవరం నుంచి మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే, ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ మంత్రి సత్యకుమార్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మల్లికార్జునను మున్సిపల్ ఆఫీసుకుకి రానిచ్చేది లేదని టీడీపీ శ్రేణులు తేల్చి చెప్పాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులను పక్కకు జరిపి.. మంత్రిని అక్కడి నుంచి పంపేశారు.
గతంలో మున్సిపల్ కమిషనర్ గా పని చేసిన మల్లికార్జున టీడీపీ శ్రేణులను వేధించారని, మున్సిపల్ స్థలాలను వైసీపీ నేతలకు అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని మళ్లీ మున్సిపల్ కమిషనర్ గా ఎలా నియమిస్తారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
ఈ వివాదంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. మల్లికార్జున సమర్ధవంతమైన అధికారి కాబట్టే మళ్లీ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చామన్నారు. గతంలో ఆయన తప్పులు చేసినట్లు ఆధారాలు లభిస్తే కచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
Also Read : జాగ్రత్త.. అంటూ పార్టీ నేతలను హెచ్చరించిన సీఎం చంద్రబాబు..
మల్లికార్జున సమర్ధవంతమైన అధికారి అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అంటున్నారు. ఆయనకు అవార్డ్ కూడా వచ్చిందని తెలిపారు. నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నాను కనుక, నాకు ఇక్కడ సమర్ధవంతమైన అధికారి ఉంటే, వారి సలహాలు సూచనల మేరకు ధర్మవరాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తప్పు చేసినట్లుగా ఆధారాలు ఉంటే.. కచ్చితంగా తానే ప్రభుత్వానికి చెప్పి మల్లికార్జునను మార్పిస్తానని టీడీపీ శ్రేణులకు మంత్రి హామీ ఇచ్చారు.