జాగ్రత్త.. అంటూ పార్టీ నేతలను హెచ్చరించిన సీఎం చంద్రబాబు..

అత్యుత్సాహంతో పోలీసులు ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

జాగ్రత్త.. అంటూ పార్టీ నేతలను హెచ్చరించిన సీఎం చంద్రబాబు..

Cm Chandrababu Naidu

Updated On : September 28, 2024 / 5:44 PM IST

Cm Chandrababu Naidu : పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమావేశం అయ్యారు. వైసీపీ అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు చంద్రబాబు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో కుట్రలను తిప్పికొట్టాలన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పల్లా శ్రీనివాస్ రావు, అశోక్ బాబులను ఆదేశించారు. మరోవైపు అనంతపురం జిల్లాలో రాములోరి రథానికి నిప్పు పెట్టిన ఘటనలో పోలీసుల పనితీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం దగ్గర ప్రస్తావన తీసుకొచ్చిన నేతలు.. విచారణ చేయకుండానే రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు చెప్పారని అన్నారు. అత్యుత్సాహంతో పోలీసులు ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : జగన్‌కు ప్రాణగండం ఉంది..!- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు సమావేశం అయ్యారు. చాలా కాలంగా సీనియర్లతో చంద్రబాబు భేటీ జరగలేదు. ఇవాళ సీరియస్ గా ఒక భేటీ అయితే జరిగింది. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు వారితో చర్చించారు. హోంమంత్రి అనిత, మంత్రి స్వామి కూడా హాజరయ్యారు. వర్ల రామయ్య, అశోక్ బాబు సహా పలువురు సీనియర్లు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ తరుపున మాట్లాడేటప్పుడు ఏదైనా సమాచారం అవసరం ఉంటే సీఎం కార్యాలయంతో మాట్లాడి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షం చేస్తున్న రాజకీయ దాడులను తిప్పికొట్టే బాధ్యత మనపై ఉందన్నారు చంద్రబాబు. వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని, తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందన్నారు చంద్రబాబు. నేతలకు తమ బాధ్యతలను ఈ సందర్భంగా గుర్తు చేశారు చంద్రబాబు.

అనంతపురం జిల్లాలో రథానికి నిప్పు పెట్టిన ఘటనను చంద్రబాబు దగ్గర నేతలు ప్రస్తావించినట్లు సమాచారం. రథం తగలబడిన దానికి కారణం వైసీపీ నేత అయితే, పోలీసులు అతడిని వెనకేసుకొచ్చారని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవు అని ఒక పోలీసు అధికారి స్టేట్ మెంట్ ఎలా ఇస్తారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు నేతలు. కొంతమంది పోలీసు అధికారుల్లో ఇంకా మార్పు రాలేదని నేతలు చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానని సీఎం చంద్రబాబు వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు చర్చించారు. ఉభయ కృష్ణా-గుంటూరు జిల్లాలు, పశ్చిమ-తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాల అభ్యర్థుల పై డిస్కషన్ జరిగింది. కృష్ణా-గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించాలని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఆలపాటి రాజా తెనాలి సీటు కోసం పని చేశారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటుని నాదెండ్ల మనోహర్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు.. ఎమ్మెల్సీ టికెట్ ఆయనకు ఇచ్చేందుకు చంద్రబాబు కొంత సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈస్ట్-వెస్ట్ గోదావరికి సంబంధించిన సీటు విషయంలో పోటీ ఎక్కువగా ఉంది. కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ రెండు సీట్లకు సంబంధించిన అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని, అందరూ కదన రంగంలోకి దిగాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండింటిని గెలిచి తీరాలని పార్టీ నేతలకు హితబోధ చేశారు చంద్రబాబు. రాజకీయ విమర్శల విషయంలో ఉపేక్షించవద్దని నేతలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రతిపక్షం చేసే విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.