జగన్‌కు ప్రాణగండం ఉంది..!- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు
ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు. మంచి పనులు చేయండి. కుట్ర రాజకీయాలు చేయకండి. ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి.

Posani Krishna Murali : లడ్డూ వివాదం, డిక్లరేషన్ రగడ, వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు తదితర అంశాలపై పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు పోసాని. అంతా కలిసి జగన్ ను ఎందుకు ఇంతలా హింసిస్తున్నారని పోసాని ప్రశ్నించారు. జగన్ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణం అన్నారు.
జగన్ కు ప్రాణగండం ఉందని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. దయచేసి జగన్ ను మాత్రం మర్డర్ చేయించమాకు, మీకు పెద్ద హిస్టరీ ఉంది నాకు తెలుసు.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. ఎప్పుడు పోతామో ఎవరికి తెలుసు, అయినా భయపడేది లేదన్నారు. నేను చచ్చినా చాలా ఏళ్ల పాటు దేశ ప్రజలు నన్ను గుర్తు పెట్టుకుంటారు అని అన్నారు. నాకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉందన్నారు పోసాని.
”తిరుమల స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎన్నో పద్ధతులు పెట్టింది. చంద్రబాబు కలలోకి వేంకటేశ్వర స్వామి వచ్చాడా. జగన్ ను తిరుమల రానివ్వద్దని చెప్పారా? చంద్రబాబు నాటకాలు అందరికీ తెలుసు. ఏ గూటికి వెళితే ఆ గూటి మాట్లాడే రకం నేను కాదు. నా గురువు జగన్ మోహన్ రెడ్డి. నేను దేవుళ్లనైనా మారుస్తాను కానీ, జగన్ ని మాత్రం మార్చను.
Also Read : జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..
ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు. మంచి పనులు చేయండి. కుట్ర రాజకీయాలు చేయకండి. ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి. ఒక లడ్డూ, డిక్లరేషన్ గురించి నికార్సైన రాజకీయ నాయకుడి హీనంగా చేస్తున్నారు. ఏమాత్రం వేంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడు. మిమ్మల్ని దీవించడు. మీరు మంచి పనులు చేయండి.. దేవుడు మీకు వందేళ్లు ఆయుష్షు ఇస్తాడు” అని పోసాని అన్నారు.