NTR Statue : గుడివాడలో హైటెన్షన్.. ఎన్టీఆర్ బొమ్మకు వైసీపీ రంగులు, టీడీపీ కార్యకర్తలపై దాడులు

కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీసీ రంగులు వేశారు. టీడీపీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటర్ దూరంలో బొమ్ములూరు ఉంది.

Ntr Statue

NTR Statue : కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు వేశారు. టీడీపీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటర్ దూరంలోనే బొమ్ములూరు ఉంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రంగులు వేసిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలు, కార్యకర్తలు బొమ్ములూరుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు వేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు ఉన్న వైసీపీ రంగులు చెరిపేసి పసుపు రంగులు వేశారు. ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. మహానాడు బ్యానర్లపై అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీమంత్రి పిన్నమనేని ఫైర్ అయ్యారు. తమ నాయకుడి విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గం అన్నారు.

Chandrababu On Amaravati Lands : జగన్‌కు అమరావతి భూములు అమ్మే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఫైర్

కాగా, పార్టీ నాయకులు వెళ్లిన తర్వాత.. బొమ్మలూరు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారు. మీ అంతు చూస్తామంటూ టీడీపీ కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.