Tadipatri
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పెద్దారెడ్డి నివాసానికి వెళ్లి.. తాడిపత్రి నుంచి ఆయన్ను తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో పట్టణంలో హైలెన్షన్ వాతావరణం నెలకొంది.
అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా చర్యలు చేపట్టారు. ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పెద్దారెడ్డి ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారు. తమకు సమాచారం లేకుండా తాడిపత్రికి రావడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఆ తరువాత ఆయన్ను బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని అనంతపురం తీసుకెళ్లారు.