సెల్ఫీ దిగేందుకు అభిమాని ప్రయత్నం.. పక్కకు తోసేసిన బాలయ్య.. వీడియో వైరల్

హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి అభిమానిపై సీరియస్ అయ్యారు. సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించిన అభిమానిని పక్కకు తోసేశారు..

Nandamuri Balakrishna : హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి అభిమానిపై సీరియస్ అయ్యారు. సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించిన అభిమానిని పక్కకు తోసేశారు.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. గతంలోనూ అనేకసార్లు అభిమానులపై బాలయ్య చేయిచేసుకున్న ఘటనలు ఉన్నాయి. గతంలో పెద్దగా పట్టించుకోని టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. ఎన్నికల సమయంలోనూ బాలయ్య అలాచేయడంపై ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : వైఎస్ షర్మిల, సునీతపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బాలకృష్ణ సైతం రెండు రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో దిగిన బాలకృష్ణ అక్కడి నుంచి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. బాలయ్యకు దగ్గరగా వెళ్లి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించగా.. బాలకృష్ణ సీరియస్ అయ్యారు.. అభిమానిని పక్కకు తోసేశారు.

ఆలయంలో పూజల అనంతరం హెలిప్యాడ్ వద్దకు తిరిగి వస్తున్న సమయంలోనూ ఓ అభిమాని బాలయ్యతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించగా.. అతనిపైకూడా బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య తీరుపట్ల కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీ దిగేందుకు అభిమానంతోవస్తే వారిపట్ల బాలయ్య ఇలా వ్యవహరించడం సరికాదని వాపోతున్నారు.

Also Read : రోజుకో టర్న్‌ తీసుకుంటున్న ఢిల్లీ పాలిటిక్స్.. రాష్ట్రపతి పాలన పెడతారని ఊహాగానాలు

 

ట్రెండింగ్ వార్తలు