Mekathoti Sucharitha
Mekathoti Sucharitha : విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన పట్ల హోంమంత్రి మేకతోటి సుచరిత విచారం వ్యక్తం చేశారు. టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుందన్నారు. బాలిక భవనం మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందన్నారు. వినోద్ జైన్ ఎంత దారుణమైన లైంగిక వేధింపులకు గురిచేశాడో, మానసిక వేదనకు గురిచేశాడో బాలిక ఆత్మహత్యను బట్టి అర్థమవుతుందన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. బాధిత బాలిక కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
Lemon Tea : లెమన్ టీ తాగితే ఎక్కవకాలం జీవించవచ్చా?…
”బాలిక ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడు వినోద్ జైన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీడీపీ నాయకుడు మైనర్ బాలిక పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంతవరకు స్పందించ లేదు.
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎంతటి దుర్మార్గాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. టీడీపీ ఎమ్మెల్యే ఒక మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకొని కొట్టడం, కాల్ మనీ పేరుతో టీడీపీ నాయకులు దురాఘతాలకు పాల్పడటం, మహిళను వివస్త్రను చేసి కొట్టడం లాంటి ఎన్నో ఘటనలు ఉన్నాయి. స్వయంగా చంద్రబాబు.. ఆడబిడ్డల పుట్టుక గురించి మాట్లాడటం, నారా లోకేష్ మహిళల గురించి అవహేళనగా మాట్లాడటం చూశాం. టీడీపీ ముఖ్య నాయకులు మహిళలను చిన్న చూపుతో చూడటం వలనే వినోద్ జైన్ లాంటి నాయకులు తయారవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ బాలిక ఆత్మహత్య ఘటన పట్ల తీవ్రంగా స్పందించారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షించే పూర్తి స్వేచ్ఛను పోలీసు శాఖకు సీఎం కల్పించారు” అని మంత్రి సుచరిత చెప్పారు.
విజయవాడ భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం ఉంటున్న బాలిక.. బెంజి సర్కిల్ వద్ద గల ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. తనను ఓ వ్యక్తి కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని నోట్ బుక్లో రాసిన బాలిక.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి
పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వినోద్ జైన్ వేధిస్తున్నాడని… పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. బాలిక సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వినోద్ పై పోక్సో కేసు నమోదు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ… వినోద్ జైన్ పై చర్యలు తీసుకుంది. అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది.