Lemon Tea : లెమన్ టీ తాగితే ఎక్కవకాలం జీవించవచ్చా?…

మోకాళ్ళ నొప్పులు,ఆహారం అరగక పోవడం వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు లెమన్‌గ్రాస్‌ టీ ఉపకరిస్తుంది.

Lemon Tea : లెమన్ టీ తాగితే ఎక్కవకాలం జీవించవచ్చా?…

Lemon Grass

Updated On : January 30, 2022 / 2:27 PM IST

Lemon Tea : మ‌న దేశంతోపాటు ప‌లు ఆసియా దేశాల్లోనూ లెమ‌న్ గ్రాస్ మొక్క బాగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల్లో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనిని మూలికాగా చెప్తారు. లెమ‌న్‌గ్రాస్ ఆకుల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్‌ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఈ ఆకులు ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. అయితే లెమన్‌గ్రాస్ ఆకుల నుంచి త‌యారుచేసే టీ ని రోజు తాగ‌డం వల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. ఈ టీని తాగితే శరీరంలో ఎలాంటి రోగాలు లేకుండా ఎక్కువ కాలం జీవించవచ్చు.

ఈ టీ తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంతో పాటు.. త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, క‌డుపు నొప్పి త‌గ్గుతాయి. అంతేకాదు ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగు ప‌డుతుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఇంకా కిడ్నీ స‌మ‌స్య‌లు తొలగిపోయి.. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గడమే కాకుండా.. డ‌యాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఫ్యాటీ లివర్ నియంత్రణకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది.ముఖ్యంగా ఊబకాయం, కొలస్ట్రాల్, వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. లెమన్ గ్రాస్ టీ నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. ఈ టీ తరచుగా శరీరమంతా శుభ్రపరిచి, శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

మోకాళ్ళ నొప్పులు,ఆహారం అరగక పోవడం వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు లెమన్‌గ్రాస్‌ టీ ఉపకరిస్తుంది. రోజూ లెమన్‌గ్రాస్‌ టీ తాగితే కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో లెమన్‌గ్రాస్‌ చక్కగా పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. స్త్రీలలో రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించటానికి ఉపకరిస్తుంది. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు దంత క్షయాన్ని అరికడతాయి.