Azadi Ka Amrit Mahotsav : రాజమండ్రిలో అతి పెద్ద జెండా ప్రదర్శన

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేద్రవరంలో  ఘనంగా భారీ జాతీయ జెండా ను రాష్ట్ర మంత్రులు ప్రదర్శించారు.

Azadi Ka Amrit Mahotsav  :  దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేద్రవరంలో  ఘనంగా భారీ జాతీయ జెండా ను రాష్ట్ర మంత్రులు ప్రదర్శించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 5,200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండా ర్యాలీ, ప్రదర్శనలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపి లు పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా 75 స్వాతంత్ర్య  దినోత్సవాలలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాలంటూ, రాబోయే మూడు రోజులు ప్రతి ఇంటిపై దుకాణం పై, ప్రభుత్వ, ప్రవేటు సంస్థలపై జాతీయ జెండా రెపె రెప లాడాలని ప్రజలను నేతలు కోరారు.

భారీగా ప్రజలు, పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు జాతీయ పతాకం ప్రదర్శనలో పాల్గొన్నారు. దేశ గౌరవాన్ని ప్రతి పౌరులు చాటాలని జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. అనంతరం భారీ జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీలో రాష్ట్ర మంత్రులు సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, ఎంపి మార్గని భరత్ రామ్,ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాుళులర్పించారు.

Also Read : Kerala : ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన తల్లీ,కొడుకు

ట్రెండింగ్ వార్తలు