Kerala : ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన తల్లీ,కొడుకు

రళలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన కేరళ పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్షల్లో తల్లీ, కుమారుడు ఇద్దరూ ఉత్తీర్ణులై  ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు.

Kerala : ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన తల్లీ,కొడుకు

kerala mother and son

Kerala : కేరళలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన కేరళ పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్షల్లో తల్లీ, కుమారుడు ఇద్దరూ ఉత్తీర్ణులై  ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. దీంతో వారు  అందరి దృష్టిని ఆకర్షించారు.  ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే తపనే ఆమెను  విజయం వైపుకు నడిపించింది.

కేరళలోని మలప్పురానికి చెందిన   బిందు(42) ఆమె కుమారుడు వివేక్(25) ఇద్దరూ   ఇటీవల జరిగిన PSC పరీక్షలకు హాజరయ్యారు.  కాగా తల్లి బిందు నాలుగు సార్లుగా ప్రయత్నించగా ఈ సారి ఉత్తీర్ణత   పొందారు. కుమారుడు వివేక్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. బిందు మొదటి రెండు సార్లు పరీక్ష రాసినప్పుడు ఆమె ఫెయిల్ అయ్యారు.  3వ ప్రయత్నంలో ఇంటర్వ్యూ దాకా వచ్చారు.  కానీ ఉద్యోగం రాలేదు.

ఆమె నాలుగో సారి ప్రయత్నం చేసే సమయానికి ఆమె కుమారుడు కూడా డిగ్రీ పూర్తి చేసి తగిన విద్యార్హతలతో పరీక్ష రాశాడు. ఇద్దరూ ఫైనల్ పరీక్షల్లో నెగ్గారు.  ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందారు.  బిందు నాలుగో సారి పరీక్ష రాసేటప్పుడు కుమారుడితో కలిసి   కోచింగ్ తీసుకుని పరీక్ష రాశారు. ఇద్దరూ  ఇంట్లో ప్రాక్టీస్ చేశారు. బిందుకు తెలియని విషయాలు ఉన్నప్పుడు వివేక్ వాటిని వివరించి తల్లికి చెప్పేవాడు. తల్లీ కుమారుడు ఇద్దరూ కలిసి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే కోచింగ్ సెంటర్ అధ్యాపకులు కూడా వారిని ప్రోత్సహించారు.

ఆమె  వయస్సును చూసి కొందరు కామెంట్ చేయటం మొదలు పెట్టారు. 42 ఏళ్ల వ్యక్తిని పరీక్షలకు ఎలా అనుమతించారని…. అయితే కొన్ని కేటగిరీలలో  వయస్సు  సడలింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న బిందు కళ ఇన్నాళ్లకు సాధ్యం అయ్యింది. కాగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా పై చదువులు చదువుతామని తల్లీ,కుమారుడు చెప్పటం సంతోష దాయకం.

Also Read : Bihar Police : హోటల్ గదిలో మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి