జగన్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది- హోంమంత్రి అనిత

పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత అనే భరోసా రావాలి. పోలీసు అకాడమీ లేని రాష్ట్రం ఏపీనే. మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పని చేస్తున్నాం.

Home Minister Vangalapudi Anitha : గత వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. పోలీసు విభాగాలకు అవసరమైన సౌకర్యాలు, ఇన్వెస్టిగేషన్ కు కావాల్సిన పరికరాలు ఏవీ లేవన్నారు. పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత అని భరోసా రావాలని ఆకాంక్షించారు మంత్రి అనిత. కూటమి ప్రభుత్వం నేర నియంత్రణ చేస్తుందని ఆమె చెప్పారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్ లో మీడియాతో మాట్లాడారు హోంమంత్రి అనిత. అంతకుముందు విశాఖ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.

”గంజాయి నివారణ మీద సమీక్ష నిర్వహించాం. పోలీస్ సంక్షేమం మీద సమీక్ష నిర్వహించాం. పోలీసు విభాగంలో ఇన్వెస్టిగేషన్ టూల్స్ లేవు. ఎక్కడ ఏం నేరం జరిగినా దాని వెనుక గంజాయి ఉంది. ఈ ఐదు జిల్లాల్లో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నాం. ఏజెన్సీలో గంజాయి పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టాం. గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించారు. హోం మంత్రి, విద్యా శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అబ్కారీ మంత్రి కలిసి ఈ ఉపసంఘం పని చేస్తోంది. గంజాయి వివరాలు ఇస్తే వారికి బహుమతి ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం.

మైనర్ బాలిక విషయంలో పోక్సో చట్టం అమలవుతోంది. విశాఖలో గంజాయి సేవించే వారికి అనుకూల ప్రాంతాలు గుర్తించి వాటి మీద పోలీసులు దృష్టి పెట్టారు. పోలీసు విభాగాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. డ్రగ్స్ సేవించిన వ్యక్తిని పరీక్షించి, నిర్ధారించే పరికరాలు లేవు. గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఐదేళ్ళలో అధునాతన పరికరాలు, వాహనాల నిర్వహణ లేదు. ఇవాళ మళ్లీ పోలీస్ వ్యవస్థ యాక్టివేట్ అయ్యింది. పటిష్టంగా పని చేస్తోంది. మా వర్క్ పరదాలు కట్టడమే కాదు, ఇంకో పార్టీ వాళ్ల ఇళ్ల దగ్గర కాపలా కాయమమే కాదు.. మా పని ఇది అని తెలుసుకుని, గుర్తించి మళ్లీ ముందుకెళ్తున్నారు. వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో హోంశాఖ మీద, హోంమంత్రి అయిన నాపై బురద జల్లుతున్నారు. మా ప్రభుత్వం వచ్చాక శాఖ పని తీరు మీద, గత ఐదేళ్ల ప్రభుత్వ విఫల విధానం మీద నేను మాట్లాడానికి సిద్ధంగా ఉన్నాను.

పోలీసుల సంక్షేమంపై దృష్టి పెట్టాం. పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత అనే భరోసా రావాలి. మా కూటమి ప్రభుత్వం నేర నియంత్రణ చేస్తుంది. మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పని చేస్తున్నాం. తిరిగి మళ్ళీ గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. పోలీసులకు వీకాఫ్ మీద పరిశీలిస్తాం. గత ప్రభుత్వంలో సరెండర్ లీవ్ లు ఇవ్వకుండా చేశారు. మా కూటమి ప్రభుత్వంలో సరెండర్ లీవులకు నిధులిస్తాం. చివరికి ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రం నుంచి తుపాకులు తెచ్చుకున్నాం. పోలీసు అకాడమీ లేని రాష్ట్రం ఏపీనే. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి కట్టడానికి నిధులిస్తే కట్టడం ఇష్టం లేక మానేశారు. సోషల్ మీడియా మీద దృష్టి పెడతాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు, గౌతు శిరీష మీద రాజద్రోహం కేసులు పెట్టారు” అని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు.

Also Read : నర్సాపురం ఎంపీడీవో ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సైబర్ నేరగాళ్ల కోసం పోలీసుల వేట..

ట్రెండింగ్ వార్తలు