Hot Summer (Photo : Google)
Hot Summer AP : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలతో జనం విలవిలలాడిపోతున్నారు. మాడు పగిలే ఎండలతో హడలిపోతున్నారు. ఈ వేసవి చాలా హాట్ గురూ అని నిట్టూరుస్తున్నారు. అసలే మండుటెండులు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో సుర్రుమనే వార్త చెప్పింది.
ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.(Hot Summer AP)
ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. ఏపీలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. భానుడు తీవ్రమైన ప్రతాపం చూపుతున్నాడు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..Hot Summer : ఏపీలో మండుతున్న ఎండలు, ఆ జిల్లాలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఆ ప్రాంతాల్లో 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం:
”ఈ రకం ఉష్ణోగ్రతలు రానున్న 5 రోజులు ఉండే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగి ఆ తర్వాత క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. వాతావరణం పొడిగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. రికార్డుల ప్రకారం తుని, విశాఖపట్నంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ టెంపరేచర్లు మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశముంది.
విశాఖ, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రభావం కాస్త తక్కువే. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం ఎండగా ఉంటోంది. సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం ఎండగా ఉన్నా సాయంత్రానికి చల్లటి వాతావరణం వచ్చే చాన్సుంది. ఉదయం వేళ మాత్రం ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి.
Also Read..Hot Summer : సమ్మర్ స్ట్రోక్.. ఏపీ ప్రజలకు అలర్ట్, మరింత పెరగనున్న ఎండల తీవ్రత
కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదయ్యే చాన్సుంది. వడగాలులు వీచే అవకాశముంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలన్నీ కూడా ఉదయం లేదా సాయంత్రం ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్ కు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. వాటర్ బ్యాటిల్ వెంట ఉంచుకోవాలి. నీడలో ఉండాలి. బయటకు ఎక్కువగా వెళ్లకపోవడమే మంచిది.” – సునంద-విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్(Hot Summer)