Hot Summer : ఏపీలో మండుతున్న ఎండలు, ఆ జిల్లాలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Hot Summer: అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాంలో 41.8 ఉష్ణోగ్రత నమోదైంది.

Hot Summer : ఏపీలో మండుతున్న ఎండలు, ఆ జిల్లాలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Hot Summer : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతలకంటే సగటున 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు అధికారులు చెప్పారు.

అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా రాజాంలో 41.8, నంద్యాల జిల్లా అవుకులో 41.6, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, విజయనగరం జిల్లా అల్లాడిపాలెంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Also Read..Andhra Pradesh : ఎండవేడికి పగిలిన కొండరాయి .. మీదపడుతుందోనని ఊరొదిలిపోతున్న జనాలు

ఎండ, ఉక్కపోతతో ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఎండ ప్రభావంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వారం రోజుల పాటు ఇలాగే వేడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. వడగాలులు వీచే అవకాశం ఉందని విప్తతుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అడ్డతీగల, నెల్లిపాక, చిత్తూరు, గంగవరం, రాజవమ్మంగి, బలరామచంద్రపురం, నర్సీపట్నం తదితర మండలాల్లో వడగాల్పులు వీస్తాయంది.(Hot Summer)

Also Read..Madasi Venkaiah: వైసీపీలో కొండేపి కుంపట్లు.. తాడేపల్లిలో మాదాసి వర్గం ఆందోళన

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఈ సీజన్ నుండి జూన్ చివరి వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, రాయలసీమ ప్రాంతంలో సాధారణ లేదా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఇది ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని చెప్పింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. ఎల్ నినో పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయని, దీనివల్ల నైరుతి రుతుపవనాల సమయంలో వర్షపాతం తగ్గవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

”కోస్తాంధ్ర మాత్రమే ఏప్రిల్-జూన్ మధ్య నాలుగు నుండి ఆరుసార్లు వేడి తరంగాలను ఎదుర్కొంటుంది. వేడిగాలుల ప్రభావం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్య సలహా ఇవ్వబడుతుంది. ముందుజాగ్రత్త చర్యగా, వేడిగాలుల సమయంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి సూచించబడుతుంది” అని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ముఖ్యంగా, 2011-2021 మధ్య అత్యధిక సగటు హీట్ వేవ్ రోజులను ఏపీ చూసింది. గరిష్టంగా 106 రోజుల పాటు ఈ తరహా పరిస్థితి ఉంది.(Hot Summer)

ఈ వేసవిలో అగ్నిప్రమాదాల నివారణకు అటవీ శాఖ ముందుజాగ్రత్త చర్యలను సూచించాలని, వేడిగాలుల కారణంగా తలెత్తే పరిస్థితిని ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి IMD సూచించింది.

Also Read..Visakha Steel Plant : విశాఖ ఉక్కుపై తెలంగాణ సర్కార్ దృష్టి .. ఏపీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

తీవ్రమైన వేడి పరిస్థితులతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి ORS, సాధారణ మందులు మొదలైన వాటిని నిల్వ చేయాలని ఆరోగ్య శాఖకు వాతావారణ శాఖ సూచించింది.