Andhra Pradesh : ఎండవేడికి పగిలిన కొండరాయి .. మీదపడుతుందోనని ఊరొదిలిపోతున్న జనాలు

రోహిణి కార్తె ఎండలకు రోళ్లు కూడా బద్దలు అవుతాయని పెద్దలు చెబుతుంటారు. అదే జరిగింది ఎండ వేడిమికి కర్నూలు జిల్లాలో. గోనెగండ్ల మండంలో ఒక పెద్ద బండరాయి పగిలిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.

Andhra Pradesh : ఎండవేడికి పగిలిన కొండరాయి .. మీదపడుతుందోనని ఊరొదిలిపోతున్న జనాలు

Rock is Cracked by the Sun ..Heavy Heatwave

Andhra Pradesh :రోహిణి కార్తె ఎండలకు రోళ్లు కూడా బద్దలు అవుతాయని పెద్దలు చెబుతుంటారు. పర్యావరణంలో వచ్చిన మార్పులకు రోహిణి కార్తి రాకుండానే బండలు సైతం పగులుతున్నాయి. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఎండల తీవ్రతకు కొండరాయి పగిలింది. దీంతో గ్రామస్తులు హడలిపోతున్నాయి. అది ఎప్పుడు పగిలిపోతుందోనని భయపడి ఊరొదిలిపోతున్నారు.

ఎండ వేడిమికి కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండంలో ఒక పెద్ద బండరాయి పగిలిపోయింది. భారీ శబ్ధంతో ఈ రాయి పగిలిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గోనెగండ్ల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమీపంలో నరసప్ప దేవాలయం దగ్గర ఓ పెద్ద కొండరాయి ఉంది. ఈ ఎండలకు అది పెద్ద శబ్ధం చేస్తూ పగిలిపోయింది. ఆదివారం (ఏప్రిల్ 9,2023)మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెద్ద శబ్ధం రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు.

ఇంత భారీ శబ్ధం ఎక్కడనుంచి వచ్చిందా? అని గ్రామస్తులు ఆందోళన చెందారు. అలా శబ్దం వచ్చిన దిశగా వెళ్లి చూడగా పగిలిన రాయి నుంచి పొగతోపాటు చిన్న చిన్న ముక్కలు రాలి పోతుండటాన్ని గమనించారు. దీంతో భయపడిన స్థానికులు పరిస్థితిని తహసీల్దార్‌ కార్యాలయానికి తెలిపారు. కొండ చుట్టూ చాలా నివాసాలున్నాయి..ఈ ఎండలకు బండలు పగిలితే ప్రమాదం జరగొచ్చని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చీలిన కొండరాయిపై మరో రాయి ఉండడంతో కింద పడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భయాన్ని అధికారులు తెలిపారు. అధికారులు సబ్ కలెక్టర్ అభిషేక్ కు సమాచారం అందించటంతో ఆయన కూడా కొండరాయి ప్రాంతాన్ని పరిశీలించారు.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు పగిలిన కొండరాయి ప్రాంతాన్ని సందర్శించారు. పరిస్థితిని సమీక్షించారు. కొండచుట్టూ ఉన్న నివాసాలను ఖాళీ చేయిస్తున్నారు. వారిని స్థానికంగా ఉండే స్కూల్ కు తరలించి వసతి ఏర్పాటు చేశారు.స్థానికుల భయపడటంతో వాస్తవం ఉందని అలాని కొండను తొలగించటం మాత్రం ఇబ్బంది ఉందని తెలిపారు. కొండరాయి చుట్టు కాంక్రీట్ ను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.కాగా ఏప్రిల్ నెలలోనే ఎండల తీవ్రతకు కొండరాళ్లు పగులుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురి అవుతున్నారు.