Madasi Venkaiah: వైసీపీలో కొండేపి కుంపట్లు.. తాడేపల్లిలో మాదాసి వర్గం ఆందోళన

సేవ్ కొండేపి సేవ్ వైయస్ఆర్ పార్టీ.. వద్దు.. వద్దు.. మాకొద్దు వరికూటి అశోక్ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Madasi Venkaiah: వైసీపీలో కొండేపి కుంపట్లు.. తాడేపల్లిలో మాదాసి వర్గం ఆందోళన

వరికూటి అశోక్ బాబు, మాదాసి వెంకయ్య (Photos: FB)

Madasi Venkaiah: ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు వీధికెక్కింది. కొండేపి వైసీపీ ఇన్ చార్జి వరికూటి అశోక్ బాబు, మాదాసి వెంకయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా తయారయింది. అశోక్ బాబు.. కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని, ఆయనను ఇన్ చార్జిగా తప్పించాలని వెంకయ్య వర్గీయులు ఆందోళన బాట పట్టారు. పార్టీ అధినేత ముందు తేల్చుకునేందుకు సిద్దమయ్యారు.

మాకొద్దు వరికూటి
కొండేపి వైసీపీ ఇన్ చార్జి పదవి నుంచి వరికూటి అశోక్ బాబు(Varikuti Ashok Babu)ను తప్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తాడేపల్లి (Tadepalli)లో అసంతృప్త వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాదాసి వెంకయ్య నాయకత్వంలో 60 కార్లతో 200 మందికి పైగా నాయకులు ఇక్కడికి చేరుకుని నిరసనకు దిగారు. సేవ్ కొండేపి సేవ్ వైయస్ఆర్ పార్టీ అంటూ సీఎం క్యాంపు కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. వద్దు.. వద్దు.. మాకొద్దు వరికూటి అశోక్ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Also Read: మూల్పూరి కళ్యాణి అరెస్ట్.. ట్విటర్ లో ఖండించిన చంద్రబాబు, లోకేశ్

మాదాసి వర్సెస్ వరికూటి
కొండేపి (Kondapi) పంచాయతీ వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వరికూలి, మాదాసి వర్గాలను ఎలా సముదాయించాలో తెలియక వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. కొండేపి నియోజక వర్గ బాద్యుడిగా వెంకయ్యను తప్పించి అశోక్ బాబును నియమించడంతో విభేదాలు మొదలయ్యాయి. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు పోటీ పడడంతో మాదాసి వర్సెస్ వరికూటిగా పరిస్థితి మారిపోయింది. అటు క్యాడర్ ను సమన్వయం చేసుకోవడంలో వరికూటి సైతం విఫలం కావడంతో కొండేపి వైసీపీలో కుంపట్లు చల్చారలేదు.

వైవీ సుబ్బారెడ్డి అనుచరుడుగా పేరుపడ్డ మాదాసి వెంకయ్య(Madasi Venkaiah) అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు తన మద్దతుదారులతో కలిసి తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అశోక్ బాబును ఇన్ చార్జిగా ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడైన అశోక్ బాబును తాజా పరిణామాల నేపథ్యంలో కొండేపి నియోజకవర్గ ఇన్ చార్జిగా వైసీపీ అధిష్టానం కొనసాగిస్తుందా, లేదా అనేది వేచిచూడాలి.

Also Read: నంద్యాల బరిలోకి దిగుతున్నా.. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగితేనే..