Fire Accident (2)
Fire Accident : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవిచింది. ఆదివారం యాడికి గ్రామ సమీపంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ బొగ్గు గొట్టం వేడెక్కి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని కార్మికులు టీ తాగేందుకు బయటకు వెళ్లిన సమయంలో ఈ పేలుడు జరిగింది. అనంతరం మంటలు ఎగసిపడ్డాయి.
చదవండి : Blast : రైలు పట్టాలపై బాంబు పేలుడు
పేలుడు జరిగిన ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. భారీ శబ్దం రావడంతో కార్మికులు ఉలిక్కిపడి పరుగులు తీశారు. ఇక పేలుడు దాటికి గొట్టం పెంకులు చాలా దూరం ఎగసిపడ్డాయి. ఫ్యాక్టరీ సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకొని మంటలు ఆర్పివేశారు.
చదవండి : Anantapur Jntu : అనంతపురం జెఎన్ టియులో బీటెక్ అడ్మీషన్స్