Anantapur Jntu : అనంతపురం జెఎన్ టియులో బీటెక్ అడ్మీషన్స్
అర్హత విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ఇంటర్ బోర్డ్‌లు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్, పన్నెండోతరగతి, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

Anantapur Jntu : అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూఏ), స్వీడన్‌లోని బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. మొదటి మూడేళ్లు అనంతపురం జేఎన్‌టీయూలో, చివరి ఏడాది బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదవాల్సి ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్‌లో మూడు స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదానికి 10 సీట్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం ప్రోగ్రామ్ పూర్తిచేసినవారు జేఎన్‌టీయూఏ నుంచి బీటెక్ డిగ్రీని, బీటీహెచ్ నుంచి బీఎస్ డిగ్రీని పొందవచ్చు. అభ్యర్థులు కోర్సు మధ్యలో వైదొలగే వీలు లేదు. బీటెక్ పూర్తయ్యాక జేఎన్‌టీయూఏలోగానీ, బీటిహెచ్‌లోగానీ పీజీ అడ్మిషన్ తీసుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మరో ఏడాదిపాటు స్వీడన్‌లో రెసిడెన్స్ పర్మిట్ ఇస్తారు.
అర్హత విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ఇంటర్ బోర్డ్‌లు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్, పన్నెండోతరగతి, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 70 శాతం మార్కులు లేదా పది పాయింట్ల స్కేల్ మీద ఏడు పాయింట్ల గ్రేడ్ సాధించి ఉండాలి. ఇంగ్లీష్ మినహా ఇతర మాధ్యమాల్లో చదివిన అభ్యర్థులు బీటీహెచ్‌లో చేరేనాటికి ఐఈఎల్‌టీఎస్, టోఫెల్ అర్హత పొందాల్సి ఉంటుంది. టోఫెల్‌లో పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే రిటెన్ టెస్ట్‌లో 4.5, మొత్తమ్మీద 575 స్కోర్ రావాలి. ఇంటర్నెట్ బేస్డ్ ఎగ్జామ్ అయితే రిటెన్ టెస్ట్‌లో 20, మొత్తమ్మీద 90 స్కోర్ రావాలి. ఐఈఎల్‌టీఎస్ ఎగ్జామ్‌లో మొత్తమ్మీద 6.5 స్కోర్ ఉండాలి.
నిర్దేశిత ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి జేఈఈ మెయిన్ 2021, ఏపీ ఈఏపీసెట్ 2021, టీఎస్ ఎంసెట్ 2021, ఇంటర్/ తత్సమాన పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్పెషలైజేషన్‌లకు సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు రూ.1500 గా నిర్ణయించారు. పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపేందుకు చివరి తేదీ నవంబరు 29గా నిర్ణయించారు. బీటీహెచ్, జేఎన్‌టీయూఏ ఆఫీషియల్స్‌తో ఇంటరాక్షన్ మీటింగ్ నవంబరు 30వ తేది ఉంటుంది. అడ్మిషన్ కౌన్సెలింగ్ డిసెంబరు 1న జరుగుతుంది. ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఓరియంటేషన్ మీటింగ్ డిసెంబరు 3న జరగనుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్ కార్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: jntua.ac.in
- Admissions : మిలటరీ కాలేజ్ లో 8వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 25తో ముగియనున్న తుదిగడువు
- Gurukul School Cobra : సోమశిల గురుకుల పాఠశాలలో నాగుపాము.. కొట్టి చంపిన విద్యార్థులు
- Scholarship : ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కు దరఖాస్తులు
- Visakha IIPE : విశాఖ ఐఐపీఈ లో పీహెచ్ డీ ప్రొగ్రామ్ లో ప్రవేశాలు
- జాబ్ సాధించిన పిల్లల పేరెంట్స్‌కు విజ్ఞాన్ వర్సిటీ సత్కారం
1Green Cards : ఆరునెలల్లో గ్రీన్‌కార్డుల అప్లికేషన్లు క్లియర్ చేయండి
2Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
3Gautam Adani సిమెంట్ రంగంలో కీలక అడుగు వేసిన అదానీ గ్రూప్
4YCP Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
5చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు
6LIC IPO Listing: నిరాశపర్చిన ఎల్ఐసీ లిస్టింగ్.. తక్కువ ధరకు షేర్ల ట్రేడింగ్
7Sainath Sharma : టీడీపీ నేత సాయినాథ్‌శర్మకు చంపేస్తామంటూ బెదిరింపులు
8Karnataka : PSI పోస్టుల భర్తీలో అక్రమాలు..న్యాయం చేయకపోతే నక్సల్స్‌లో చేరుతామని ప్రధానికి రక్తంతో లేఖ రాసిన అభ్యర్థులు
9DMHO Eluru Recruitment : ఏలూరు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ
10Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
-
Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
-
Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
-
PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
-
CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ