Vijayawada Investments Fraud: విజయవాడలో రూ.300 కోట్ల భారీ మోసం.. బాధితుల్లో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా..! స్కామ్ జరిగిందిలా..

ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వేగంగా స్పందించి సంస్థ ఎండీని అదుపులోకి తీసుకున్నారు.

Vijayawada Investments Fraud: పెట్టుబడుల పేరుతో విజయవాడలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి తమను మోహిత్ ట్రేడింగ్ కంపెనీ ముంచేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. లక్ష రూపాయల పెట్టుబడికి 6వేల రూపాయల వడ్డీ చెల్లిస్తామని ఆశ పెట్టిన కంపెనీ బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన వారిలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రారంభోత్సవానికి ప్రముఖ రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించిట్లు బాధితులు చెబుతున్నారు. మొత్తం 1200 మంది నుంచి 300 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వేగంగా స్పందించి సంస్థ ఎండీ వెంకట్ ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు.

అధిక వడ్డీలు చెల్లిస్తామని ప్రకటనలతో ఊరించింది మోహిత్ ట్రేడింగ్ కంపెనీ. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతి నెల 6వేలు వడ్డీ చెల్లిస్తామంది. అలా నమ్మించి పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసింది. అలా 300 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారిలో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా ఉన్నట్లు సమాచారం.

ప్రముఖ రాజకీయ నాయకులను పిలిపించి పెద్ద ఎత్తున కంపెనీ ప్రారంభోత్సవం చేసినట్లు సమాచారం. 1200 మందికిపైగా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉంటున్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఎండీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు.

Also Read: ఆ నీళ్లు తాగొద్దు.. హైదరాబాద్ వాసులకు హైడ్రా హెచ్చరిక.. పీసీబీ నివేదికలో షాకింగ్ విషయాలు

పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇది భారీ మోసం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతుగా దర్యాఫ్తు జరుపుతున్నారు. త్వరలోనే మరికొందరిని అదుపులోకి తీసుకోబోతున్నారు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ల నుంచి పెద్ద పెద్ద వాళ్లు కూడా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. భారీ మోసం కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. పూర్తి దర్యాఫ్తు తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.