Sunnam Cheruvu Water: ఆ నీళ్లు తాగొద్దు.. హైదరాబాద్ వాసులకు హైడ్రా హెచ్చరిక.. పీసీబీ నివేదికలో షాకింగ్ విషయాలు

బోరబండ, మాదాపూర్ లోని హాస్టళ్లు, విద్యా సంస్థలకు సున్నం చెరువు నీళ్లు సరఫరా అవుతున్నాయి.

Sunnam Cheruvu Water: ఆ నీళ్లు తాగొద్దు.. హైదరాబాద్ వాసులకు హైడ్రా హెచ్చరిక.. పీసీబీ నివేదికలో షాకింగ్ విషయాలు

Updated On : June 27, 2025 / 7:03 PM IST

Sunnam Cheruvu Water: హైదరాబాద్ సున్నం చెరువు నీటితో ఆరోగ్య సమస్యలు వస్తాయని హైడ్రా అధికారులు హెచ్చరించారు. సున్నం చెరువులో కాలుష్యం ఉన్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించిందని హైడ్రా తెలిపింది. బోరబండ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ సున్నం చెరువు ఉంది. బోరబండ, మాదాపూర్ లోని హాస్టళ్లు, విద్యా సంస్థలకు సున్నం చెరువు నీళ్లు సరఫరా అవుతున్నాయి. సున్నం చెరువు నీళ్లు ఉపయోగిస్తే అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉందని హైడ్రా అధికారులు హెచ్చరించారు. సున్నం చెరువు వాడితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పీసీబీ నివేదికలో తెలిపింది.

హైదరాబాద్ లో ఉండే చెరువుల్లో నీరు కలుషితం అవుతోంది. మురుగు నీరు, కెమికల్స్ వచ్చి చేరుతున్నాయి. వాటి వల్ల తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. సున్నం చెరువు ఉంటే బోరబండ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో బోర్లు వేసి గ్రౌండ్ వాటర్ ని తీసుకుని అమ్మేస్తున్నారు. ఆ నీటిని సేకరించిన హైడ్రా అధికారులు పీసీబీకి పంపింది. పీసీబీ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

ఆ నీటిలో ఉండాల్సిన లవణాల శాతం కంటే ఎక్కువ శాతం లవణాలు ఉన్నట్లు గుర్తించారు. సీసం, కాడ్మియం, నికల్ వంటి లోహాలు ఉన్నాయి. ఇవన్నీ మోతాదుకు మించి ఉన్నాయి. ఇవి చాలా హానికరం చేస్తాయి. కొన్ని హాస్టళ్లు, కంపెనీలు ఆహారం చేసేందుకు ఈ నీటినే వాడుతున్నాయి. అయితే, ఈ నీటిని వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పీసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైడ్రా అధికారులు ప్రకటించారు.

చెరువు చుట్టూ ఉంటే ప్రాంతంలో అనేక చోట్ల బోర్లు వేసి ఆ నీటిని అమ్ముతున్నారు. అలాంటి నీటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హైడ్రా చెప్పింది. సున్నం చెరువు అభివృద్ధిపై హైడ్రా ఫోకస్ చేసింది. సిటీలో ఉండే అన్ని చెరువుల్లోనూ ఇదే విధమైన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. బోర్లు వేసి నీటిని అమ్మాలంటే అధికారులు పర్మిషన్ కచ్చితంగా ఉండాలి. కానీ, చాలా మంది బోర్లు వేసి అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నట్లు హైడ్రా అధికారుల విచారణలో తేలింది.

సున్నం చెరువు 30 ఎకరాల్లో ఉంటుంది. అయితే, చాలా కాలంగా ఇది కలుషితం అవుతోంది. పైనుంచి వచ్చే మురుగు నీరు, రసాయనాలు అందులో కలుస్తున్నాయి. దాంతో చెరువు పొల్యూషన్ అయ్యింది. ఈ చెరువుని 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని హైడ్రా నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని పనులు చేపట్టింది. ఈ క్రమంలో పీసీబీ నివేదికలో భయంకరమైన అంశాలు బయటకు వచ్చాయి. వీటిని హైడ్రా అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు. ప్రధానంగా హైడ్రా అధికారులు చెప్పేది ఒక్కటే. స్థానికంగా ఉండే హోటళ్లు, హాస్టల్స్, విద్యా సంస్థలు అక్కడి గ్రౌండ్ వాటర్ ని వాడకపోవటమే మంచిదని స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళా సంఘాలు, రైతులకు గుడ్‌న్యూస్

కాలుష్య నియంత్రణ మండలి (PCB) అనుమతించదగిన పరిమితులను మించి సీసం, కాడ్మియం, నికెల్ జాడలను కనుగొంది. అంతర్జాతీయ ప్రమాణాల కంటే 7-12 రెట్లు సీసం ఉన్నట్లు PCB అధ్యయనంలో వెల్లడైంది. అధిక మొత్తంలో సీసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పిల్లల్లో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రక్తహీనత, మూత్రపిండాల డ్యామేజ్, హృదయ సంబంధ ప్రభావాలు, సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. మూత్రపిండాలను ప్రభావితం చేసే, క్యాన్సర్ కారకంగా వర్గీకరించబడిన కాడ్మియం కూడా అనుమతించదగిన పరిమితుల కంటే 2-3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. నికెల్ స్థాయిలు కూడా అనుమతించదగిన పరిమితుల కంటే 2 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

నీటిని మరిగించడం వల్ల భారీ లోహాలు కరిగిపోవని, పైగా విషపూరిత లోహాల సాంద్రతకు దారితీయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. తాగునీటి అవసరాల కోసం సున్నం చెరువు నుండి బోర్ల ద్వారా నీటి అమ్ముతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హైడ్రా తెలియజేసింది. శివరాంపల్లిలోని బం-రుక్న్-ఉద్-దౌలా, మాదాపూర్‌లోని తమ్మిడి కుంట, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, ఉప్పల్‌లోని నల్ల/పెద్ద చెరువులో పునరుద్ధరిస్తున్న ఆరు ట్యాంకుల్లో మాదాపూర్‌లోని సున్నం చెరువు ఒకటి. సున్నం చెరువులోని నీటిని కాలుష్యం నుండి రక్షించడానికి రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు.