Huge Theft : గుంటూరులో భారీ చోరీ.. తాళాలు పగలగొట్టి ఇంట్లో బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

బాధితుడు నర్సింహ్మరావు ఫిర్యాదుతో రంగంలోకి కొత్తపేట పోలీసులు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

huge theft

Theft In Home : గుంటూరులో భారీ చోరీ జరిగింది. కొత్తపేట మంగళబావి వీధిలో పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు మూడు కిలోల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.

Kondagattu Anjaneyaswamy Temple Robbery : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనం.. గర్భగుడిలోని విలువైన వస్తువులు, విగ్రహాలు చోరీ

బాధితుడు నర్సింహ్మరావు ఫిర్యాదుతో రంగంలోకి కొత్తపేట పోలీసులు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వ్యవధిలో దొంగతనం జరిగినట్టు గుర్తించారు. రద్దీగా ఉండే ప్రాంతం, పోలీసు స్టేషన్ కు దగ్గర ఉన్న ప్రాంతంలో చోరీ జరగడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.