స్నేహితులతో కలిసి భార్య పై అత్యాచారం చేసిన భర్త

husband raped wife ,along with his friends : తాళి కట్టిన భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన కిరాతక భర్త ఉదంతం గుంటూరులో వెలుగు చూసింది. గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన షేక్ మీరావలికి అదే ప్రాంతానికి చెందిన మహిళతో ఏడేళ్ళ క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా గత కొంతకాలం నుంచి భార్య భర్తలు విడిపోయి వేర్వేరుగా నివసిస్తున్నారు.

డిసెంబర్ 17వ తేదీన భార్య తరుఫు బంధువులు, మీరావలి మధ్య గొడవ జరగింది. ఈ నేపధ్యంలో మీరావలి నగరంపాలెం పోలీసు స్టేషన్ లో భార్యతరుఫు వారిపై ఫిర్యాదు చేశాడు. అదే రోజు గొడవలు పడొద్దు…. కలిసి ఉందామని అడిగేందుకు మీరావలి భార్య భర్త ఇంటికి వచ్చింది.

అ సమయంలో మీరావలి తన స్నేహితులు రబ్బానీ, సలీంలతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. రాజీ మార్గానికి వచ్చిన భార్య చెప్పే మాట వినకుండా ఆమెపై తన స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారినుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఆమె రోడ్డుపై పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమెను గుర్తించిన బంధువులు, స్ధానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.