Wig Cheating : బట్టతలకు విగ్గు పెట్టుకుని 20 మంది యువతులకు టోకరా..బ్లాక్ మెయిల్ చేస్తు డబ్బులు వసూలు

బట్టతలకు విగ్గు పెట్టుకుని 20 మంది యువతులకు టోకరా ఇచ్చిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Wig Cheating : బట్టతలకు విగ్గు పెట్టుకుని 20 మంది యువతులకు టోకరా..బ్లాక్ మెయిల్ చేస్తు డబ్బులు వసూలు

Man Arrested (1)

Updated On : November 11, 2021 / 3:44 PM IST

బుర్రంతా బట్టే. కానీ విగ్గు పెట్టుకుంటాడు. అమ్మాయిలకు వల వేస్తాడు.కుచ్చుటోపీ పెడతాడు. ఎన్నారైగా కలరింగ్‌ ఇచ్చుకుంటు అమ్మాయిలకు మాయమాటలు చెబుతాడు. అతని మాటలు నమ్మిన అమ్మాయిలు ఎంతోమంది. కార్తీక్ వర్మ అనే కేటుగాడు ఒకరి తరువాత మరొకరిని మోసం చేయటమే పనిగా పెట్టుకున్నాడు. వారితో సహజీవనం చేస్తాడు. కానీ ఎల్లకాలం మోసాలు సాగువు కదా..అలా ఓ అతని వలలో పడ్డ ఓ అమ్మాయి వాడి బండారాన్ని బట్టబయలు చేసింది. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సదరు బట్టతల బాబుని అరెస్ట్ చేసి సెల్ లో వేశారు. ఈ మాయగాడి మోసాల చిట్టా తక్కువేమీ లేదు. తన బట్టతల దాచిపెట్టి ఎన్నారైని అంటూ మాయ మాటలు చెప్పి ఆంధ్రా తెలంగాణల్లో 20మంది అమ్మాయిల్ని మోసం చేసి ఆఖరికి ఓ అమ్మాయి దగ్గర గుట్టు రట్టు అయి కటకటాల పాలయ్యాడు..

Read more :  కర్నూలు విద్యుత్ శాఖలో కుంభకోణం.. లైన్_మెన్_పై వేటు

బట్టతలను కవర్ చేసి విగ్గూ పెట్టుకొన్ని మోసాలకు పాల్పడుతున్న కార్తీక్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్ మీడియాలో తానొక ఎన్‌ఆర్‌ఐ అంటూ…మహిళలను ట్రాప్‌ చేసేవాడు కార్తీక్. తన వివాహం కాలేదని చెప్పి విగ్గుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేవాడు కార్తీక్ వర్మ. అయితే.. ఆ అందమైన కార్తీక్ వర్మ ఫోటోలు చూసి వలలో పడుతున్నారు అమ్మాయిలు. ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన కార్తీక్ వర్మ .. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని కొన్నాళ్లపాటు సహజీవనం చేశాడు.

Read more : Extra Marital Affair Murder : వివాహేతర సంబంధం-హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ

వ్యక్తిగత సమయంలో తీసిన ఫోటోలను చూపి బ్లాక్‌ మెయిల్ చేస్తాడు. దీంతో బాధిత అమ్మాయిలు బయటకు చెప్పుకోలేని అతను అడగిన డబ్బులు, బంగారం ఇచ్చుకుంటారు. అలా కార్తీక్ వర్మ ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఈక్రమంలో కూకట్ పల్లి లోని ఓ అమ్మాయిని మోసం చేసి డబ్బులు లాగేసుకున్న కార్తీక్ వర్మ. దీంతో ఆ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ వర్మ ను అరెస్ట్ చేశారు. కార్తీక్ వర్మ పై పీడీ యాక్ట్ చేసిన పోలీసులు…విచారణ చేయగా అతని వలలో పడి 20మంది అమ్మాయిలుమోసపోయారని తేలింది.