Yarlagadda Venkat Rao : గన్నవరం నాదే, ఇక్కడి నుంచే పోటీ, టికెట్ ఇవ్వకుంటే- వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా నుంచి తీసుకొచ్చి నిన్ను క్రాస్ రోడ్ లో పెట్టను అని సీఎం చెప్పారు. Yarlagadda Venkat Rao - Gannavaram

Yarlagadda Venkat Rao - Gannavaram

Yarlagadda Venkat Rao – Gannavaram : గన్నవరం వైసీపీలో రాజకీయం వేడెక్కింది. గనవర్నం సీటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. గన్నవరం నాదే అంటే నాదే అని నేతలు మాటల యుద్ధానికి దిగారు. తాజాగా వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ గన్నవరం టికెట్ విషయమై హాట్ కామెంట్స్ చేశారు. గన్నవరం నాదే అని ఆయన అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని, తాను గన్నవరం నుంచే పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్రావ్ తేల్చి చెప్పారు. వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ పాల్గొన్నారు. గన్నవరం టికెట్ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.

” ఆత్మీయ సమావేశానికి వచ్చే వాళ్ళను వేధింపులకు గురిచేయడంతో కొంతమంది ఆగిపోయారు. మన కార్యకర్తల మీద కేసులు తీయలేదు. అధికారం మన చేతిలో ఉన్నా ఏమీ చేయలేకపోయాము. 2019లో సీఎం జగన్ నన్ను పెనమలూరు నుంచి పోటీ చేయాలని కోరారు. నీ భవిష్యత్తు నాది అని పూచీ ఇచ్చి గన్నవరంలో పోటీ చేయమని చెప్పారు. దుట్టా రామచంద్ర రావు నిన్ను నడిపిస్తాడని చెప్పి సీఎం జగన్ గన్నవరం సీటు ప్రకటించారు. గన్నవరం సెక్యూలర్ నియోజకవర్గం. గన్నవరంలో రెండుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. పార్టీ వీక్ గా ఉన్న సమయంలో పాదయాత్ర ద్వారా ప్రతి వ్యక్తిని కలిశాను. దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికలకు ముందు నాపై అనేక కేసులు పెట్టారు. దురదృష్టవశాత్తు 270 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను.(Yarlagadda Venkat Rao)

Also Read..Galla Family: గల్లా కుటుంబం తరుఫున ఎవరు పోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!

ఎమ్మెల్యే కావాలన్న నా కోరిక తీరకపోయినా కార్యకర్తల కోరికలు తీరతాయని అనుకున్నా. ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేను తీసుకుని సీఎం దగ్గరికి వెళ్లారు. నన్ను, దుట్టాను పిలిచి మాట్లాడతారని అనుకున్నాను. వల్లభనేని వంశీతో కలిసి పని చేయాలని సీఎం సూచించినా నా వల్ల కాదని చెప్పాను. రాజకీయాల్లో ఉన్నంతకాలం గన్నవరంలో ఉంటానని చెప్పాను. పోటీ ఖాయం. 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తాను. కార్యకర్తల సంక్షేమం జిల్లా మంత్రులు చూస్తారని చెప్పారు. నియోజకవర్గంలో ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. MLC ఇస్తానని సీఎం చెప్తే వద్దన్నాను. అన్నం తినే వారు ఎవరూ వైసీపీలో చేరరని వంశీ అన్నారు.

జగన్ పాదయాత్రలో గన్నవరంలో షెల్టర్ కూడా ఇవ్వలేదని చెప్పాను. వంశీతో కలిస్తే నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చేది. అయినా కలవలేదు. నాకు అన్యాయం చేయనని సీఎం జగన్ చెప్పారు. విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పార్టీలో పెద్ద మనిషి కోరారు. గన్నవరం వదులుకోను అని ఆయనకు చెప్పాను. అలా చెప్పిన కొన్ని రోజులకే కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి పోయింది. నా వెంట ఉన్న ఇంతమందిని వదిలేసి గన్నవరం నుంచి ఎందుకు వెళ్లిపోవాలి?

అమెరికా నుంచి తీసుకొచ్చి నిన్ను క్రాస్ రోడ్ లో పెట్టను అని సీఎం చెప్పారు. మేనిఫెస్టోతో గడప గడపకూ తిరిగి జగన్ కు ఓటు వేయాలని అడగడం నేను చేసిన తప్పా? సంస్కారం అడ్డొస్తుంది తప్ప. ఎవరికీ భయపడేది లేదు. ఎన్ని అవమానాలు వచ్చినా సీఎంను ఒక్క మాట కూడా అనలేదు.

Also Read..Bonda Uma : వైసీపీ 175కి 175 సీట్లు గెలిస్తే మా పార్టీని మూసేస్తాం : బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నుంచి వచ్చిన ముగ్గురికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. కానీ దుట్టాకు ఏ అర్హత తగ్గింది? అన్యాయాన్ని ఎదిరించిన వారిని ఇండిపెండెంట్లుగా గెలిపించారు. రెండేళ్ల నుంచి సీఎంను కలుద్దామంటే అవకాశం ఇవ్వలేదు. నాకు టిక్కెట్ ఇవ్వాలని సీఎంను అభ్యర్దిస్తున్నా. టిక్కెట్ ఇవ్వకుంటే గన్నవరం ప్రజలు నా భవిష్యత్తును నిర్ణయిస్తారు. గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని కార్యకర్తల సమక్షంలో సీఎం జగన్ ను అడుగుతున్నా. గన్నవరంలోనే పోటీ చేస్తా. ఇక్కడే రాజకీయం చేస్తా” అని తేల్చి చెప్పారు యార్లగడ్డ వెంకట్రావ్.

ఏపీ రాజకీయాల్లో గన్నవరం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ పై గెలిచిన వంశీ.. ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో యార్లగడ్డ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు.. మళ్లీ గన్నవరంలోకి ఎంట్రీ ఇచ్చిన యార్లగడ్డ.. గవన్నరం నాదే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు. దాంతో గన్నవరం వైసీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు