Chandrababu
Chandrababu: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మనం మన వర్తమానాన్ని త్యాగం చేసినట్లయితే, మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారని గుర్తుచేసుకున్నారు.
“ఈరోజు ఎయిడెడ్ స్కూళ్ల ఆస్తుల కోసం రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేశారని అన్నారు చంద్రబాబు. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలల హక్కుల పరిరక్షణ కోసం ‘భారత యాత్ర’ చేపట్టిన కైలాశ్ సత్యార్థితో పాటు.. నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీధుల్లో పాదయాత్ర చేశాను” అన్నారు.
అవసరమైతే ఇప్పుడు పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం మళ్ళీ రోడ్డు మీదకు వస్తానని అన్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన వనరులు బాలలేనని అన్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మనదేనని, జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల హక్కుల పరిరక్షణకు, లైంగిక దాడుల నుంచి వారిని కాపాడేందుకు మనందరం కలసికట్టుగా కృషి చేసేందుకు ప్రతిన బూనుదామని అన్నారు.
Chittur Kuppam : కుప్పంలో మున్సిపల్ ఎన్నిక..ఫుల్ టెన్షన్, స్థానికేతరులు వెళ్లిపోవాలి పోలీసుల ఆదేశాలు