Chittur Kuppam : కుప్పంలో మున్సిపల్ ఎన్నిక..ఫుల్ టెన్షన్, స్థానికేతరులు వెళ్లిపోవాలి పోలీసుల ఆదేశాలు

కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఫుల్ టెన్షన్ పుట్టిస్తున్నాయి. స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీసులు చెబుతూ..తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Chittur Kuppam : కుప్పంలో మున్సిపల్ ఎన్నిక..ఫుల్ టెన్షన్, స్థానికేతరులు వెళ్లిపోవాలి పోలీసుల ఆదేశాలు

Kuppam

Kuppam Municipal : కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఫుల్ టెన్షన్ పుట్టిస్తున్నాయి. స్థానికేతరులు కుప్పం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో కుప్పం సమీప ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసినా స్థానికేతరులు కుప్పంలోనే ఉండాలని ప్రయత్నిస్తున్నారు. 2021, నవంబర్ 13వ తేదీ శనివారం అర్ధరాత్రి వరకు పోలీసులు స్థానికేతరులను ఖాళీ చేయించే పనిలో నిమగ్నయ్యారు.

Read More : Corona Cases : రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి

పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించి స్థానికేతరులను పోలీసులు ఖాళీ చేయించారు. దీంతో కొంతమంది ఇళ్లల్లో రహస్యంగా స్థానికేతర నాయకులు ఉంటున్నారని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న ఇళ్లకు వేలాది రూపాయల అద్దె చెల్లించేందుకు స్థానికేతరులు సిద్ధమయ్యారు.  స్థానికేతరుల గుర్తింపు కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం కుప్పం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు.

Read More : IMD : 14, 15వ తేదీల్లో భారీ వర్ష సూచన, రెడ్ అలర్ట్ జారీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం హోరాహోరీగా చేశారు. రాష్ట్రంలోని టీడీపీ కీలక నేతలు కుప్పంలో తిష్టవేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయగా..వైసీపీ నేతలు కూడా ప్రచారం జోరుగా నిర్వహించారు. చంద్రబాబు సొంతగడ్డని వైసీపీ వశం చేసుకోవాలని ఉర్రుతలూగుతోంది. మంత్రి పెద్దిరెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కుప్పంలో తిష్టవేసి ప్రచారం చేశారు. రాష్ట్రం మొత్తం ఓ లెక్క.. కుప్పం ఓ లెక్క అన్నట్లుగా ప్రచారం సాగింది.