IMD : 14, 15వ తేదీల్లో భారీ వర్ష సూచన, రెడ్ అలర్ట్ జారీ

భారీ వర్షాలతో దేశంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షానికి చెన్నై చిగురాటుకులా వణికిపోయింది. మరో తుపాన్ గండం పొంచి ఉందనే సమాచారంతో రాష్ట్రాలు భయపడిపోతున్నాయి.

IMD : 14, 15వ తేదీల్లో భారీ వర్ష సూచన, రెడ్ అలర్ట్ జారీ

Kerala

IMD Predicts Heavy Downpour : భారీ వర్షాలతో దేశంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షానికి చెన్నై చిగురాటుకులా వణికిపోయింది. మరో తుపాన్ గండం పొంచి ఉందనే సమాచారంతో రాష్ట్రాలు భయపడిపోతున్నాయి. ఎక్కడి నుంచి ఉపద్రవం వస్తుందో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. నవంబర్ 14, 15వ తేదీల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని IMD కేరళ రాష్ట్రాన్ని హెచ్చరించింది. తిరువనంతపురానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురంలో 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

Read More : Amravati Curfew: అమరావతిలో హింస.. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా…ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికూడ్, వాయనాడ్, కన్నూరు, కాసర్గోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతం మీదుగా..అండమాన్ సముద్రంలో మరో 12 గంటల్లో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, నవంబర్ 15వ తేదీ నాటికి బంగాళాఖాతానికి చేరుకుని తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయని తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో సీఎం పినరయ్ విజయన్ అప్రమత్తమయ్యారు.

Read More : T20 World Cup 2021 : మాథ్యూ వేడ్ విజయం వెనుక ఎన్నో కష్టాలు, సమస్యలు

నదీ తీరాలు, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రదేశాలు, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అత్యవసర శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్ కోయిల్ జంక్షన్ కన్నియాకుమారి సెక్షన్ మధ్య వరద ఉధృతి కొనసాగుతుండడంతో…రెండు రైళ్లను పూర్తిగా, 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.