Pilli Subhash Chandra Bose : అదే జరిగితే పార్టీలో ఉండను- పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన ప్రకటన

2024లో రామచంద్రాపురం నియోకవర్గం నుంచి వేణుకి కనుక సీటు ఇస్తే నేను మద్దతివ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటన చేయడంతో వివాదం మరింత ముదిరింది. Pilli Subhash Chandra Bose

Pilli Subhash Chandra Bose

Chelluboina Srinivasa Venugopala Krishna : అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్.. మంత్రి చెల్లుబోయిన వేణు మధ్య టికెట్ పంచాయితీ నడుస్తోంది. 2024లో రామచంద్రాపురం నియోకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి వేణుకి కనుక మళ్లీ టికెట్ ఇస్తే నేను మద్దతివ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటన చేయడంతో వివాదం మరింత ముదిరింది. అంతేకాదు.. వేణుకి సీటు ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారాయన.

”పార్టీ నిబంధనలను తూచ తప్పకుండా పాటించే నైజం నాది. పార్టీ పెట్టక ముందే జగన్ వెనకాల నడిచా. అందుకు కారణం ఏంటంటే. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు దైవం, నాకు అండగా నిలబడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్ కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు వారి దయ వల్ల పదవుల్లో కొనసాగటం కరెక్ట్ కాదని, దేవుడు నన్ను క్షమించడు అనే ఒకే ఒక్క కారణంతో ఆ రోజున పదవిని విడిచిపెట్టి జగన్ మోహన్ రెడ్డి వెనకాల నడిచాను.

జగన్ కూడా నాకు ఎక్కడా లోటు చెయ్యలేదు. జగన్ ను ఒక్కమాట అన్నా మహా పాపం. జీవితంలో ఆ పని చెయ్యను. చాలా అత్యున్నతమైన పదవులు ఇచ్చి నన్ను గౌరవించారు. ఇక్కడ వేణుకి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా నన్ను అడిగారు. నేను అభ్యంతరం చెప్పలేదు. కానీ, వేణు పాలనా విధానం చూస్తుంటే బాధ కలుగుతోంది. కార్యకర్తలను వేధిస్తున్నాడు, అవినీతికి పాల్పడుతున్నాడు. ఇటువంటి పనులు చేసి పార్టీని అప్రదిష్ట పాలు చేస్తున్నాడు. బోసు దగ్గరికి వెళ్లొద్దని కార్యకర్తలకు చెప్పాడు. ఏ పనీ చేయొద్దని అధికారులతో చెప్పాడు. నియోజకవర్గంలో ఎక్కడా తిరగొద్దని పైనుంచి నాతో చెప్పించాడు.

Also Read..Hindupur : బాలయ్యను ఓడించేలా వైసీపీ భారీ స్కెచ్.. రెబెల్స్ తేనేతుట్టెను కదిపిన టీడీపీ..

15రోజుల క్రితం చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు సమావేశం పెట్టుకున్నారు. బోసుని పిలుద్దాం అన్నారు. అయితే, బోసుని పిలవటానికి వీల్లేదు అని మంత్రి వేణు చెప్పాడు. దీన్ని నేను అవమానంగా భావించాను. ఈసారి కనుక వేణుకి టికెట్ ఇస్తే అవసరమైతే పార్టీని విడిచి పెట్టి అయినా సరే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా. అంతేతప్ప వేణుని అంగీకరించే ప్రశ్నే లేదని పార్టీ పెద్దలకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ కు కూడా చెప్పాను” అని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు