YCP Leaders : ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లుంటే తొలగించాలి.. ఈసీకి వైసీపీ నేతల విజ్ఞప్తి

కొంతమందికి తెలంగాణలో, ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఓటు వేశాక ఏపీలోనూ ఓటు వెయ్యడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

YCP Leaders

YCP Leaders Appeal EC : ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని వైసీపీ నేతలు అన్నారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే వాటిని తొలగించాలని ఈసీని కోరారు. ఈ మేరకు బుధవారం వైసీపీ నేతలు జోగి రమేష్, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ ను కలిశారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న విషయాన్ని నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి వాటిని తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

కొంతమందికి తెలంగాణలో, ఏపీలోనూ ఓట్లు : జోగి రమేష్ 

కొంతమందికి తెలంగాణలో, ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఓటు వేశాక ఏపీలోనూ ఓటు వెయ్యడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనేది తమ పార్టీ స్టాండ్ అని తెలిపారు. తాము ఓట్లు తొలగిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

16 లక్షల మందికి రెండు చోట్లా ఓట్లు : మంత్రి మేరుగ 
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఒకటే ఓటు ఉండాలన్నారు. 16 లక్షల మందికి రెండు చోట్లా ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఎన్నికల కమిషన్ ను కోరామని వెల్లడించారు.

తెలంగాణలో ఎన్నికలు అయ్యాకా అక్కడ క్యాన్సల్ చేసుకుని ఇక్కడ ఓటు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలా రెండు చోట్లా ఓటు అంశంపై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అయితే తాము ఓట్లు ఎక్కడ తొలగించామో, దొంగ ఓట్లు ఎక్కడ చేర్చామో టీడీపీ, జేఎస్పీ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు