Nara Lokesh (Twitter, Google)
Nara Lokesh – CM Jagan : ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు నారా లోకేశ్. జగన్ తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు, ఒకవేళ ప్రజలు ఆయనకు ఇంకో అవకాశం ఇస్తే కనుక.. మీ ఇళ్లు, పొలాలు, ఆస్తులు లాక్కుంటాడు అని నారా లోకేశ్ హెచ్చరించారు. కావలిలో బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కావలి నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం అన్నారు లోకేశ్. కావలిలోనే 150 రోజుల మైలురాయిని చేరుకున్నా, కావలిలోనే 2వేల కిలోమీటర్ల మైలరాయిని చేరుకోబోతున్నా అని చెప్పారు.
”జగన్ ఈ మధ్య పదే పదే నేను మీ బిడ్డని అంటున్నాడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. ఇంకో ఛాన్స్ ఇస్తే నేను మీ బిడ్డనే కదా అని మీ ఇళ్లు, పొలాలు, ఆస్తులు రాసివ్వండి అని లాక్కుంటాడు. ఈ మధ్యే ఏపీకి కూడా ఐపీఎల్ క్రికెట్ టీం ఉండాలి అన్నాడు. స్టేడియంలో ప్రాక్టీస్ చెయ్యడానికి వెళ్లే ప్లేయర్స్ కి ఎంట్రీ ఫీజు పెట్టి దోచుకుంటున్న జగన్ ఐపీఎల్ టీం పెడతాడా?
ఈ మధ్యే ఒక పోస్ట్ చూసా. సైకో జగన్ ఏపీకి ఐపీఎల్ టీం ఉంటే ఏం పేరు పెడతాడు అని? ఆప్షన్స్ చూసి నాకు నవ్వు ఆగలేదు, ఆప్షన్స్ ఏంటో తెలుసా? 1) త్రీ క్యాపిటల్స్ 2. కోడి కత్తి వారియర్స్ 3. జేసీబీ నైట్ రైడర్స్ 4. బూమ్ బూమ్ ఛాలెంజర్స్. జగన్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లాడు? మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో ఏ8 అవినాశ్ ని కాపాడటానికి. రెండో ఆప్షన్ ఏ9 గా జగన్ పేరు పెట్టకుండా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి. మూడో ఆప్షన్. భార్య భారతీ రెడ్డి గారిని కేసు నుండి తప్పించడానికి.
కావలిని కనకపట్నంగా మార్చేస్తారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని రెండు సార్లు గెలిపించారు. ఆయన కావలిని కష్టాలపట్నంగా మార్చేశాడు. ఆయనకి పేరులో మాత్రమే ప్రతాపం ఉంది. మనిషిలో ప్రతాపం లేదు. ప్రశాంతంగా ఉండే కావలి అరాచకాలకు అడ్డాగా మార్చేశాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకు కావలిని కేరాఫ్ అడ్రస్ గా మార్చేశాడు. ఆయన చేసిన అవినీతి గురించి, అరాచకాల గురించి తెలుసుకున్న తర్వాత ఆయనకి ముద్దుగా అనకొండ అని పేరు పెట్టాను” అని విమర్శించారు లోకేశ్.