NTR Health University row: పేర్లు మార్చాలని అనుకుంటే ఈ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా?: పవన్ కల్యాణ్

ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇంట్లో వారి పేర్లను ప్రజా ఆస్తులకు పెట్టడం ఏంటీ? అని పవన్ కల్యాణ్ అన్నారు. వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ పేరును మార్చి ఏమి సాధించాలనుకుంటున్నారో రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

NTR Health University: ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇంట్లో వారి పేర్లను ప్రజా ఆస్తులకు పెట్టడం ఏంటీ? అని పవన్ కల్యాణ్ అన్నారు. వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ పేరును మార్చి ఏమి సాధించాలనుకుంటున్నారో రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ బదులుగా వైెఎస్సార్ అని పేరు పెడితే వర్సిటీలో, రాష్ట్రంలో వైద్య వసతులు మెరుగైపోతాయా అని నిలదీశారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ లేవని చెప్పారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు లేవని అన్నారు. సిబ్బంది అందుబాటులో లేరని చెప్పారు. ఔషధాలు కూడా ఉండడం లేదని అన్నారు. పేర్లు మార్చాలని అనుకుంటే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా? అని అన్నారు.

ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతోనే ఉందని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన దివంగత యల్లాప్రగడ సుబ్బారావు పేరు ఈ పాలకులకు ఎవరికైనా తెలుసా? అని అన్నారు. వైద్య విశ్వవిద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధి ఉంటే యల్లాప్రగడ సుబ్బారావు పేరును పరిగణించేవారని అన్నారు. ఇంట్లోవాళ్ల పేర్లను ప్రజా ఆస్తులకు పెట్టే ముందు ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలని చెప్పారు.

Vallabhaneni Vamsi : ఎన్టీఆర్ పేరు తొలగింపుపై వల్లభనేని వంశీ అభ్యంతరం.. సీఎం జగన్‌కు ప్రత్యేక విన్నపం

ట్రెండింగ్ వార్తలు