Vallabhaneni Vamsi : ఎన్టీఆర్ పేరు తొలగింపుపై వల్లభనేని వంశీ అభ్యంతరం.. సీఎం జగన్‌కు ప్రత్యేక విన్నపం

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని విన్నవించారు.

Vallabhaneni Vamsi : ఎన్టీఆర్ పేరు తొలగింపుపై వల్లభనేని వంశీ అభ్యంతరం.. సీఎం జగన్‌కు ప్రత్యేక విన్నపం

Vallabhaneni Vamsi : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రచ్చ రచ్చ జరుగుతోంది. అటు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలకు దిగాయి. జగన్ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి.

ఇటు అధికార పార్టీ వైపీపీలోనూ దుమారం రేగింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే పేరు మార్పు బిల్లుని వెనక్కి తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం తన అభిప్రాయాన్ని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ను వంశీ కోరారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని విన్నవించారు.

పెద్ద మనసుతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారని.. జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, విప్లవాత్మకమని చెప్పారు. ఎన్టీఆర్ కు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వని గుర్తింపును కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని కొనియాడారు. ఎన్టీఆర్ చొరవతోనే హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటైందని.. ఈ నేపథ్యంలో యూనివర్సిటీకి ఆయన పేరునే కొనసాగించాలని సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు ఎమ్మెల్యే వంశీ.

 

ఎన్టీఆర్ పేరు మార్పుపై వంశీ ట్వీట్..