అమరావతిలో భవన నిర్మాణాలు పరిశీలించిన ఐఐటీ నిపుణులు.. కీలక వ్యాఖ్యలు

భవనాల పటిష్ఠత, సామర్థ్యా నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని..

అమరావతిలో ఐఐటీ నిపుణులు భవన నిర్మాణాలు పరిశీలించారు. రాజధానిలో అసంపూర్తిగా ఆగిపోయిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. రెండు రోజులపాటు రాజధానిలో కట్టడాలను పరిశీలిస్తారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన ఎమ్యెల్యే, ఎమ్యెల్సీ క్వార్టర్స్, సెక్రటేరియట్, హెచ్‌వోడీ కార్యాలయాల టవర్లు, హైకోర్టు భవనాల కోసం వేసిన భారీ ఫౌండేషన్ సామర్థ్యాన్ని మద్రాస్ఐ ఐటీ ఇంజనీర్లు తొలి రోజు పరిశీలించారు.

రాజధాని అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం మీడియాతో ఐఐటీ హైద్రాబాద్ ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం, మున్వర్ బాషా మాట్లాడారు. భవనాల పటిష్ఠత, సామర్థ్యా నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని సుబ్రహ్మణ్యం అన్నారు. భవనాల ప్రస్తుత స్థితి, నిలచి ఉన్న నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు.

సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. ప్రాథమికంగా నిర్మాణాలను పరిశీలించామని తెలిపారు. నిర్మాణాలకు వాడిన మెటీరిటల్ గురించి తెలుసుకుని, వాటి నాణ్యత గురించి తెలుసుకుంటామని చెప్పారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు సమయం పడుతుందని వివరించారు.

Also Read: జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారు

ట్రెండింగ్ వార్తలు