Karthik
Vizag Sea Coast Dead Body : హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్టరీ వీడింది. విద్యార్థి కార్తీక్ మృతదేహం వైజాగ్ సముద్రం ఒడ్డున లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
దీంతో కార్తీక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు విషాధంలో ఉన్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్ ను పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా కార్తీక్ విశాఖకు వెళ్లినట్లుగా గుర్తించారు.
జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో విశాఖకు వెళ్లాడని చెప్పారు. విశాఖలోని ఓ బేకరీ షాప్ వుడా పార్క్ దగ్గర సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల్లో విద్యార్థి కార్తీక్ కనిపించాడు. బీచ్ రోడ్డులో కూడా తిరిగినట్లు గుర్తించారు. చివరికి వైజాగ్ సముద్రం ఒడ్డున కార్తీక్ మృతదేహం లభించింది.