Trains Coming Opposite Same Track : హైదరాబాద్ మలక్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో.. ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా వచ్చిన రెండు లోకల్ ట్రైన్స్

అప్రమత్తమైన లోకో పైలట్లు ట్రైన్లను ఆపి వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది గుర్తించిన రైల్వే అధికారులు దాదాపు అర్ధగంట వరకు రైళ్లను ట్రాక్స్ పైనే నిలిపివేశారు.

Trains Coming Opposite Same Track : హైదరాబాద్ మలక్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో.. ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా వచ్చిన రెండు లోకల్ ట్రైన్స్

Trains Coming Opposite Same Track

Updated On : July 25, 2023 / 7:28 AM IST

Hyderabad Malakpet Railway Station : హైదరాబాద్ మలక్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ కు పెను ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్ పైకి రెండు లోకల్ ట్రైన్స్ ఎదురెదురుగా వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలట్లు ట్రైన్లను ఆపి వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇది గుర్తించిన రైల్వే అధికారులు దాదాపు అర్ధగంట వరకు రైళ్లను ట్రాక్స్ పైనే నిలిపివేశారు. అనంతరం రూట్ క్లియర్ చేసి మరో ట్రాక్ పై ఒక రైలును మళ్లించారు. ప్రమాదం జరగకుండా సేఫ్ గా ప్రాణాలతో బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Telangana Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. పాఠశాలల పనివేళల్లో మార్పులు

అయితే, రెండు లోకల్ రైళ్లు ఎదురెదురుగా ఒకే ట్రాక్ పై ఒకేసారి ఎలా వచ్చాయి? ఎక్కడ లోపం జరిగిందన్న దానిపై రైల్వే అధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.