AP Rains : ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగబట్టాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది.

AP Rains : ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగబట్టాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది. ఇంకా ప్రజలు కోలుకోనేలేదు. ఇంతలో మరో పిడుగు లాంటి వార్త వినిపించింది వాతావరణ శాఖ. ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ థాయ్ లాండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

”దక్షిణ థాయ్ లాండ్ పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడింది. రాగల 12 గంటల్లో అండమాన్ సముద్రానికి అల్పపీడనం చేరనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి బలపడి.. డిసెంబర్ 2వ తేదీ కల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీకల్లా బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది. వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో డిసెంబర్ 4వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని” వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి తుపాను ముప్పు ఉత్తరాంధ్ర తీరంపై ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.

Financial Planners : మీ ఆదాయం రూ.10లక్షల లోపేనా? నెలకు రూ.3,300 ఆదా చేస్తే.. రూ.9 కోట్లు కూడబెట్టొచ్చు.. ఎలాగంటే?

ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో తుపాను హెచ్చరిక చేయడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. నెల్లూరులో పెన్నా, పంబలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో మైలవరం, గండికోట, బుగ్గవంక ప్రాజెక్టులు ఎప్పుడూ లేనంతగా జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో.. చెరువులు, కుంటలు ప్రమాదపుటంచున ఉన్నాయి.

Paytm Transit Card : పేటీఎం ఆల్ ఇన్-వన్ కార్డు.. అన్ని ట్రాన్సాక్షన్లకు ఒకే కార్డు!

ట్రెండింగ్ వార్తలు