Financial Planners : మీ ఆదాయం రూ.10లక్షల లోపేనా? నెలకు రూ.3,300 ఆదా చేస్తే.. రూ.9 కోట్లు కూడబెట్టొచ్చు.. ఎలాగంటే?

డబ్బులు అందరూ సంపాదిస్తారు. కానీ, కొందరే ఆ డబ్బును పొదుపుగా వాడుకోగలరు. ఎంత సంపాదించిన వచ్చింది వచ్చినట్టే ఆవిరై పోతుంటుంది. చాలామందికి మనీ మెయింటెనెన్స్ చేయడంపై అవగాహన ఉండదు

Financial Planners : మీ ఆదాయం రూ.10లక్షల లోపేనా? నెలకు రూ.3,300 ఆదా చేస్తే.. రూ.9 కోట్లు కూడబెట్టొచ్చు.. ఎలాగంటే?

Earning Less Than Rs 10 Lakh A Year Here's How To Accumulate Rs 9 Crore By Saving Just Rs 3,300 A Month

Financial Planners : డబ్బులు అందరూ సంపాదిస్తారు. కానీ, కొందరు మాత్రమే ఆ డబ్బును పొదుపుగా వాడుకోగలరు. ఎంత సంపాదించిన వచ్చింది వచ్చినట్టే ఆవిరై పోతుంటుంది. చాలామందికి మనీ మెయింటెనెన్స్ చేయడంపై అవగాహన ఉండదు. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే.. సంపాదించిన మొత్తాన్ని కూడబెట్టుకోవడం మరో ఎత్తు.. మీరు సంపాదించింది కొద్ది మొత్తమే అయినప్పటికీ దాన్ని సరైన క్రమంలో ఆదా చేస్తూ పోతే కోట్లు కూడబెట్టుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా ఒక్కటే.. పొదుపు మంత్రం.. ఏడాదికి లక్షల్లో సంపాదించేవారు కూడబెట్టేదానికంటే ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. అందులో నెలవారీ ఖర్చుల నుంచి ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్టమెంట్లు ఇలా మరెన్నో లావాదేవీలతో సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఒక ప్లానింగ్ ఉండితీరాలి. ఫైనాన్సియల్ ఫ్లానింగ్ అనేది ప్రతిఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో సరిగ్గా అడుగులు పడితే కోట్లు సంపాదించడం చాలా సులభమేనని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు..

ఏడాదిలో రూ. 10 లక్షల కంటే తక్కువగా సంపాదించేవారిని ఒకసారి గమనిస్తే.. సెక్షన్ 80C కింద వారు తమ పన్ను ఆదా చేసే పెట్టుబడులను పూర్తి చేయడానికే తెగ కష్టపడిపోతుంటారు. ఏడాది చివరిలో వారి బీమా ప్రీమియం చెల్లించడానికి, PPF అకౌంట్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఇబ్బందిపడిపోతుంటారు. ఎందుకిలా జరుగుతుందంటే..  వారిలో డబ్బును పొదుపు చేయడంలో సరైన అవగాహన లోపించడమే కారణంగా చెప్పవచ్చు. ప్రతినెలా అద్దె, విద్యుత్, రవాణా, టెలికాం బిల్లులు, ఇంట్లో ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. వారికి వచ్చే సంపాదన ఈ ఖర్చులతోనే సరిపోతుంది. పొదుపు చేసేది ఎక్కడ.. అయినప్పటికీ వారు ఎలాగైనా తమ డబ్బు ఆదా చేసుకోవాలని భావిస్తుంటారు.

ముఖ్యంగా యువకులు.. తమ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే విధానంలో మార్పులు చేసుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. చాలామంది సంపాదన ఖర్చు చేసిన తర్వాత మిగిలినది పొదుపు చేయాలని చూస్తుంటారు. ఇది ఎంతమాత్రం సరైనది కాదు.. ఎందుకంటే.. వచ్చిన సంపాదనలో ఖర్చు చేయడానికి ముందే ఆదా చేసే విధానం ఉండాలి. మీకు వచ్చే రోజువారీ ఆదాయంలో 20 శాతం ఆదా చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

20శాతం సేవింగ్స్ టార్గెట్.. ఇదిగో ఇలా! :
మీరు చేయాల్సిందిల్లా.. మీకు వచ్చే మీ టేక్-హోమ్ (Take Home) జీతంలో 20శాతం పొదుపు చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇందుకోసం మీ నెలజీతం పడే బ్యాంకులో ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ECS) విధానాన్ని తప్పనిసరిగా సెట్ చేసుకోవాలి. అదే బ్యాంక్‌లో ఒక ఏడాది రికరింగ్ డిపాజిట్ (RD)కి ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చూసుకోవాలి. మిగిలిన మొత్తం డబ్బుతోనే 80శాతం ఖర్చులకు సరిపోయేలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయడం ప్రారంభంలో మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో మీరు ఈ ఖర్చు విధానాన్ని అలవాటు అయిపోతుంది. పొదుపు చేయడమనేది ఒక ఆర్థికపరమైన క్రమశిక్షణగా భావించాలి. వాస్తవానికి డబ్బు ఆదా అనేది దానంతంట అదే జరిగిపోదు. మీరు చేసే ఖర్చుల్లో ఖరీదైన గాడ్జెట్‌లు మొదలైన వాటిపై ఖర్చు చేయడం తగ్గించుకోవడం ద్వారా ఆదా చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక ఏడాది RD పూర్తైన తర్వాత.. ఆ మొత్తాన్ని మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించడానికి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌, (ELSS) ఆదా చేయడానికి మాత్రమే వినియోగించుకోవాలి. తద్వారా మీరు సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ పొందుతారు. రిటైర్మెంట్ కార్పస్‌ను కూడా పొందుతారు. ఇది ఏడాదికి ఏడాదికి పెరుగుతు పోతుంది. మీ కెరీర్ ప్రారంభ ఏళ్లలో PPF కన్నా ELSS స్కీమ్‌లకు మాత్రమే ఎక్కువ మొత్తాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. తద్వారా దీర్ఘకాలంలో మీరు అధిక కాంపౌండింగ్ రాబడిని పొందేందుకు వీలుంటుంది. ELSS స్కీమ్స్.. 20-30 ఏళ్ల వ్యవధిలో 12-15శాతం మధ్య కాంపౌండింగ్ రాబడిని అందిస్తాయి. PPF 7-8శాతం కన్నా ఎక్కువ ఇవ్వదని గుర్తుంచుకోవాలి. PPF నుంచి వచ్చే రాబడిలో ట్యాక్స్ లేనప్పటికీ ELSS స్కీమ్స్ నుంచి వచ్చే నికర రాబడి (పన్ను అనంతర రిటర్న్‌లు) ఎల్లప్పుడూ PPF కంటే ఎక్కువగా ఉంటాయని ఫైనాన్షియల్ ప్లాన్లర్లు అంటున్నారు.

ELSS ద్వారా ఎంతవరకు ఆదా చేయొచ్చంటే? :
మీరు SIP ద్వారా ప్రతి నెలా ELSS ఫండ్స్‌లో రూ. 3,000 వరకు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు రిటైర్మెంట్ ద్వారా భారీ మొత్తంలో కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు. మీ వయస్సు 25 ఏళ్లు ఉంటే.. ELSS స్కీమ్‌లో రూ. 3,172 పెట్టుబడి పెట్టడం ద్వారా SIPని ప్రారంభించాలి. మీ జీతభత్యాల్లో పెరుగుదలకు తగినట్టుగా ప్రతి ఏడాదికి ఈ SIP మొత్తాన్ని 10శాతం పెంచుకుంటూ పోవాలి. అలా మీకు 60 ఏళ్లు వచ్చేసరికి మీరు రూ. 5 కోట్లు కూడబెట్టుకోవచ్చు.

అంటే.. 35ఏళ్ల పెట్టుబడి వ్యవధిలో 12శాతం CAGR వర్తిస్తుంది. మీ రిటర్న్ ఎక్స్‌పెటేషన్ (return expectation) 15శాతానికి పెంచినట్లయితే.. మీరు ప్రతి నెలా రూ.3,306 SIPతో ప్రారంభించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయస్సు వరకు ప్రతి ఏడాది 10శాతం పెంచుకుంటూ పోవాలి. తద్వారా మీ రిటైర్మెంట్ కార్పస్‌ను రూ. 9 కోట్ల వరకు కూడబెట్టుకోవచ్చు అనమాట.