Ashwini Dutt : వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం, 160 సీట్లు ఖాయం- మురళీమోహన్, అశ్వనీదత్ హాట్ కామెంట్స్

చంద్రబాబును చూస్తే చాలా బాధగా ఉంది. గ్రహణం పోయి త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారు. Ashwini Dutt

Ashwini Dutt - Murali Mohan

Ashwini Dutt – Murali Mohan : చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమకు చెందిన మురళీమోహన్, అశ్వనీదత్ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వారు మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ పై వారు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఏం నేరం చేశారని జైల్లో పెట్టారు అని ప్రశ్నించారు నటుడు మురళీమోహన్. చంద్రబాబును చూస్తే చాలా బాధగా ఉందన్నారు. గ్రహణం పోయి త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని మురళీమోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కనీస వసతులు లేకుండా చంద్రబాబును ఖైదీల మధ్య జైల్లో ఉంచారని ఆయన వాపోయారు.

Also Read..TDP: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

చంద్రబాబు అరెస్ట్ ను నిర్మాత అశ్వనీదత్ ఖండించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం అని ఆయన జోస్యం చెప్పారు. చంద్రసేన 160 సీట్లు సాధిస్తుందన్నారు. చంద్రసేన అంటే టీడీపీ ప్లస్ జనసేన అని వివరించారు. రాని వాళ్ల గురించి ఇప్పుడెందుకు? సినిమా ఇండస్ట్రీ అంటే నేను మురళీమోహన్ మాత్రమే అనుకుంటా అని అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read..Hero Suman : చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ కామెంట్స్.. ఇదొక గుణపాఠం..