CM Chandrababu Naidu
India Economy: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ జపాన్‌ను దాటేసిందన్నారు. 2028 నాటికి జర్మనీని కూడా అధిగమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే కీలక పాత్ర అని చంద్రబాబు చెప్పారు.
నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం భారత జీడీపీ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుతోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం, ఎన్డీఏ ప్రగతిశీల పాలనకు ఈ విజయం నిదర్శనం అన్నారు. ప్రపంచంలో భారత్ కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఇది ప్రతిబింబిస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు.
వరల్డ్ లో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. ఈ విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. జీడీపీలో జపాన్ ను అధిగమించి భారత్ దూసుకెళ్లిందన్నారు. భారత్ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవటంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నాలుగో స్థానాన్ని ఇండియా కైవసం చేసుకుందని తెలిపారు. నిన్న 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన జీడీపీ గురించి ప్రస్తావించారు. పెట్టుబడుల దృష్టిని భారత్ ఆకర్షించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
ఇదే విధంగా మనం ముందుకు సాగితే మరో మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ఖాయమన్నారు నీతి ఆయోగ్ సీఈవో. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే మూలధనం వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ సాధించాలన్నారు. వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. కార్మికులతో తయారీకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఇది సాధ్యమన్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్ పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకం అన్నారాయన.
Also Read: ఎన్డీయే పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం.. రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం..